close

తాజా వార్తలు

Published : 01/06/2020 12:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ సమయంలో అండర్‌గ్రౌండ్‌కు ట్రంప్‌..!

వాషింగ్టన్‌: ఆఫ్రికన్‌ - అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా అమెరికాలో జరుగుతున్న నిరసనలు ఆదివారం తీవ్రరూపం దాల్చాయి. నిరసనకారులు ఏకంగా అధ్యక్ష భవనం ‘వైట్‌ హౌస్‌‌’ ముందుకు చేరుకొని బీభత్సం సృష్టించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిపైకి భాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. దాదాపు వెయ్యి మంది వరకు శ్వేతసౌధానికి ఉత్తర దిశగా ఉన్న లాఫాయెట్‌ పార్క్‌కు చేరుకొని నినాదాలు చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ బారికేడ్లను ధ్వంసం చేశారు. వాటికి నిప్పంటించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆ పరిసరాల్లో ఉన్న అమెరికా జాతీయ జెండాను తీసి మంటల్లో వేశాడు. మరికొంతమంది అక్కడ ఉన్న చెట్లను విరిచి కొమ్మల్ని ఆ మంటల్లో వేశారు. పార్క్‌ పక్కనే ఉన్న బాత్‌రూంలు, ఇతర నిర్వహణ కార్యాలయాలు ఉన్న ఓ నిర్మాణానికి నిప్పంటించారు. కొంతమంది వైట్‌ హౌజ్‌పైకి రాళ్లు రువ్వే ప్రయత్నం చేశారు.

ఇలా నిరసనకారుల ఆందోళనలు క్రమంగా మిన్నంటడంతో వైట్‌ హౌస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు అప్రమత్తమయ్యారు. పరిస్థితులు చేదాటకుముందే అధ్యక్షుడు ట్రంప్‌ను ఉగ్ర దాడుల వంటి అత్యవసర సమయంలో ఉపయోగించే రహస్య బంకర్‌లోకి తీసుకెళ్లారు. దాదాపు గంటపాటు ఆయన్ని అక్కడే ఉంచినట్లు సమాచారం. నిరసనకారుల ఆగ్రహావేశాలను చూసి ఆ సమయంలో ట్రంప్‌ బృందం తీవ్ర ఆశ్చర్యానికి లోనైనట్లు ఓ ఉన్నతాధికారి వివరించారు. అయితే, ఆయన సతీమణి మెలనియా ట్రంప్‌, కొడుకు బారన్‌ ట్రంప్‌ను కూడా బంకర్‌లోకి తీసుకెళ్లారా అన్న దానిపై స్పష్టత రాలేదు. ఇలా అధ్యక్షుడు బంకర్‌లోకి వెళ్లడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఏకంగా అధ్యక్షుడే కాసేపు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందంటే అక్కడ నిరసనలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని