close

తాజా వార్తలు

Published : 02/06/2020 22:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జీ7 సదస్సుకు మోదీకి ట్రంప్‌ ఆహ్వానం

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇవాళ ఫోన్లో సంభాషించారు. భారత్‌- చైనా సరిహద్దు సహా, అమెరికాలో నిరసనలు, జీ7 సదస్సు వంటి అంశాలపై ఈ ఇద్దరు నేతలు చర్చించారని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ట్వీట్‌ చేసింది.

కాలం చెల్లిన జీ7 దేశాల కూటమిని విస్తరించాల్సి ఉందని డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. దీనిని జీ10గానో, జీ11గానో మార్చాల్సి ఉందని తెలిపారు. కొత్త కూటమిలో భారత్‌ను కూడా చేర్చుకుంటే బాగుంటుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో అమెరికాలో జరగబోయే జీ7 సదస్సుకు రావాలని ప్రధాని మోదీని ట్రంప్‌ ఆహ్వానించారని పీఎంవో వెల్లడించింది. వాస్తవానికి జూన్‌లో ఈ సదస్సు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. మరోవైపు వీటితోపాటు భారత్‌-చైనా సరిహద్దు పరిస్థితులు, అమెరికాలోని ప్రస్తుత అల్లర్లు, రెండు దేశాల్లో కరోనా పరిస్థితులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)లో సంస్కరణల అవసరం తదితర విషయాలపై మోదీతో ట్రంప్ చర్చించినట్లు పీఎంవో తెలిపింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని