5.7 సెకన్లలో 100 కి.మీ వేగం
close

తాజా వార్తలు

Published : 03/06/2020 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

5.7 సెకన్లలో 100 కి.మీ వేగం

బెంజ్‌ జీఎల్‌ఈ ఎల్‌డబ్ల్యూబీ విడుదల
ధరల శ్రేణి రూ.88.8-89.9 లక్షలు

దిల్లీ: జర్మనీకి చెందిన విలాసవంత కార్ల సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ టాప్‌-ఎండ్‌ పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్‌ లాంగ్‌ వీల్‌బేస్‌ (ఎల్‌డబ్ల్యూబీ) జీఎల్‌ఈలను భారత విపణిలో విడుదల చేసింది. వీటి ధరల శ్రేణి రూ.88.80-89.90 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌, కేరళ మినహా). ఈ కొత్త టాప్‌-ఎండ్‌ వేరియంట్లు 450 4మేటిక్‌ (పెట్రోల్‌), 400 డీ 4మేటిక్‌ (డీజిల్‌)ల్లో లభ్యమవుతాయి. బీఎస్‌-6 ప్రమాణాలతో 6-సిలిండర్‌ ఇంజిన్లతో ఈ కార్లు రూపొందినట్లు కంపెనీ తెలిపింది. జీఎల్‌ఈ 450 4మేటిక్‌ ఎల్‌డబ్ల్యూబీ 367 హెచ్‌పీ సామర్థ్యం కలిగి, 5.7 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుందని బెంజ్‌ తెలిపింది. అలాగే కొత్త జీఎల్‌ఈ 400డీ 4మేటిక్‌ ఎల్‌డబ్ల్యూబీ 330 హెచ్‌పీ సామర్థ్యంతో 5.7 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది. ఈ రెండు కొత్త వేరియంట్లలో ఆటో పార్క్‌ అసిస్ట్‌ 360 డిగ్రీస్‌ సరౌండ్‌ వ్యూ కెమెరా, స్మార్ట్‌ఫోన్‌ ఇంటిగ్రేషన్‌, ఈజీ ప్యాక్‌ టైల్‌ గేట్‌, ముందు సీట్లకు మెమొరీ ప్యాకేజీ, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటయ్యేలా వెనక సీట్లు, ఎలక్ట్రిక్‌ సన్‌ బ్లిండ్స్‌, పనోరామిక్‌ సన్‌ఫ్రూప్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ వంటి పలు సౌకర్యాలు ఉన్నట్లు కంపెనీ వివరించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని