close

తాజా వార్తలు

Published : 03/06/2020 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దరఖాస్తుల్లో లోపాలుంటే జులై 31లోపు సరిదిద్దుకోండి

రూ.5,000 లోపు రిఫండ్‌లు వస్తాయి
పీఏసీఎల్‌ మదుపర్లను కోరిన సెబీ

దిల్లీ: రూ.5,000 వరకు క్లెయిమ్‌ చేసుకున్న పీఏసీఎల్‌ మదుపర్లు తమ దరఖాస్తు స్థితిని తనిఖీ చేసుకోవడంతో పాటు లోపాలుంటే సరిదిద్దుకోవడానికి జులై 31 వరకు గడువు ఇస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. అప్పుడే వారికి రిఫండ్‌లు సక్రమంగా అందుతాయని తెలిపింది. ‘మదుపర్ల క్లెయిమ్‌ దరఖాస్తుల స్థితిని తెలిపే పోర్టల్‌ జనవరి 24 నుంచి పని చేస్తోందని, 2020 జులై 31 వరకు దరఖాస్తుల స్థితి తెలుసుకోవడంతో పాటు, లోపాల సవరణ చేసుకోవచ్చ’ని సెబీ వివరించింది. 18 ఏళ్ల కాలంలో పీఏసీఎల్‌ సామూహిక మదుపు పథకాల పేరిట వ్యవసాయ, స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టండంటూ ప్రజల నుంచిరూ.60000 కోట్లకు పైగా నిధులు అక్రమంగా సేకరించిన సంగతి తెలిసిందే. ఇందులో పెట్టుబడి పెట్టిన మదుపర్లకు రిఫండ్లు చేసేందుకు వీలుగా రిటైర్డ్‌ జస్టిస్‌ ఆర్‌ఎమ్‌ లోధా నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. గత జనవరిలో రూ.5,000 లోపు క్లెయిమ్‌లున్న 3.81 లక్షల మంది మదుపర్లకు రిఫండ్లు చెల్లించామని సెబీ తెలిపింది. దరఖాస్తుల్లో ఒకటి లేదా అంత కంటే ఎక్కువ లోపాలున్న వారికి డబ్బులు అందలేదని పేర్కొంది. వారు లోపాలను సరిదిద్దుకోవడానికి జులై 31 వరకు తాజాగా గడువు ఇచ్చింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని