close

తాజా వార్తలు

Updated : 04/06/2020 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కృష్ణాబోర్డు సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: కృష్ణా నదిపై తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల నిర్మాణమే ప్రధాన అజెండాగా గురువారం హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్యబోర్డు కీలక సమావేశం ప్రారంభమైంది. బోర్డు ఛైర్మన్‌ పరమేశం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో.. డీపీఆర్‌లతో పాటు నీటి కేటాయింపులు, టెలీమెట్రీ సహా ఇతర అంశాలపై చర్చించే అవకాశముంది. రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం, ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులపై భిన్నవాదనల నేపథ్యంలో ఈ సమావేశం కీలకమయింది. 12 ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అధికారులు సిద్ధం చేశారు. తుంగభద్రపై గుండ్రేవుల వద్ద జలాశయం నిర్మాణంకోసం 2019లో పాలనామోదం ఇచ్చినా ఇంకా అడుగు ముందుకు పడలేదు. ఈ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనకరమన్న కోణంలో ఏపీ ఆలోచిస్తోంది. దీనివల్ల తెలంగాణలో అయిదు గ్రామాలు ముంపులో చిక్కుకుంటాయి. వేదవతి, ఆర్‌డీఎస్‌ కుడి కాలువ, తుంగభద్రపై ఎత్తిపోతల పనులు ప్రారంభం కావాల్సి ఉంది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.