close

తాజా వార్తలు

Published : 04/06/2020 20:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్‌ - 9 PM

1. 2550మంది తబ్లిగీలకు భారత్‌లో నో ఎంట్రీ!

విదేశాల నుంచి భారత్‌ వచ్చిన తబ్లిగీ కార్యకర్తలు ఇక్కడ వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు విచారణలో తేలింది. ఇలా వచ్చిన దాదాపు 2550మంది విదేశీయులను భారత ప్రభుత్వం ఇప్పటికే నిషేధిత జాబితాలో చేర్చింది. తాజాగా వీరందరిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన 2550మంది తబ్లిగీలను 10ఏళ్ల పాటు భారత్‌లోకి రాకుండా నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. డీపీఆర్‌లు ఇచ్చేందుకు అంగీకరించాయి:కృష్ణా బోర్డు‌

కొత్త ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లు అందించేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించాయని.. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకుని డీపీఆర్‌లు అందజేస్తామని అధికారులు తెలిపినట్లు కృష్ణా బోర్డు ఛైర్మన్‌ పరమేశం వెల్లడించారు. యథావిధిగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 66:34 నిష్పత్తిలో నీటిని వినియోగించుకునేలా బోర్డు కేటాయింపులు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. పీపీఈ కిట్లిచ్చినా వైద్యులకు ఎలా సోకింది

కరోనా విపత్కర పరిస్థితుల్లో వివిధ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు రక్షణ కిట్లు (పీపీఈ కిట్లు) ఇచ్చినప్పటికీ వారికి కరోనా ఎలా సోకిందో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, పరీక్షల నిర్వహణపై విశ్రాంత డీఎంహెచ్‌వో రాజేందర్‌, విశ్రాంత ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు, మరికొంత మంది దాఖలు చేసిన 7 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. జూన్‌‌ 20 నుంచి ఇంజినీరింగ్‌ పరీక్షలు

తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడిన ఇంజినీరింగ్‌ పరీక్షలను నిర్వహించేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్‌) సన్నద్ధం అవుతోంది. ఈ నెల 20 నుంచి బీటెక్, బీఫార్మసీ చివరి సెమిస్టర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇంజినీరింగ్‌ పరీక్షలకు సంబంధించిన పలు కీలకమైన మార్గదర్శకాలను జేఎన్‌టీయూహెచ్‌ జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. కరోనా బాధితుడి ఇంట్లో చోరీ

కరోనా బారిన పడిన ఓ వ్యక్తి ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఆల్వాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రగతిశీల కాలనీలో ఓ ప్రైవేట్‌ ఉద్యోగికి మే 11న కరోనా నిర్ధారణ అయింది. వెంటనే బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించి.. ఆయన భార్య, ఇద్దరు పిల్లలను క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచారు. కరోనా నుంచి కోలుకొని తిరిగి ఇంటికి వచ్చిన ఉద్యోగి తన ఇంటి తలుపులు తెరిచి ఉండడం చూసి విస్మయానికి గురయ్యారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10 తులాల బంగారం, రూ. 30 వేల నగదు ఎత్తుకెళ్లారని బాధితుడు పోలీసులకు తెలిపారు.

6. WHO వైఖరి మార్పు: క్లోరోక్విన్‌ ట్రయల్స్‌కు ఓకే

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ)పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వైఖరి మార్చుకుంది. కరోనా వైరస్‌ చికిత్స కోసం క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఉపయోగించడం వల్ల గుండె, రక్తనాళాల వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని విదేశాల్లోని వైద్యులు ఆరోపించడంతో డబ్ల్యూహెచ్‌వో ఆ ట్రయల్స్‌ను నిలిపివేసింది. సేఫ్టీ డేటాను సమీక్షించిన తర్వాత ట్రయల్స్‌ కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. లాక్‌డౌన్‌ వేతనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

దేశంలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్న 54 రోజుల కాలంలో ఉద్యోగుల వేతనాల చెల్లింపు అనేది ఉద్యోగులు, యాజమాన్యానికి సంబంధించిన విషయమని కేంద్రం సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించింది. వేతనాల చెల్లింపు విషయంలో దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారిస్తూ.. వేతనాల చెల్లింపు విషయంలో అనుసరించాల్సిన విధానాన్ని యాజమాన్యం, ఉద్యోగులు సమైక్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఏనుగు కేసు: ముగ్గురు అనుమానితుల గుర్తింపు

కేరళలో ఏనుగు మృతి ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ ఈ కేసులో ముందడుగు పడింది. ఈ ఘటన బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు అనుమానితుల్ని కేరళ పోలీసులు గుర్తించి విచారణ జరుపుతున్నారు. అనుమానితుల్ని విచారిస్తున్నారని, న్యాయం గెలిచి తీరుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ట్వీట్‌చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. మాల్యా అప్పగింత అప్పుడే కుదరదు: బ్రిటన్‌

ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు రుణాలు ఎగవేసి భారత్‌లో కేసులు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా లండన్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. అతడిని భారత్‌కు అప్పగించేందుకు అవసరమైన ప్రక్రియ ప్రారంభమైందనుకుంటున్న క్రమంలో, తదుపరి చట్టపరమైన సమస్యలు పరిష్కారమయ్యేదాకా మాల్యాను భారత్‌కు అప్పగించడం వీలుకాదని బ్రిటిష్‌ హైకమిషన్‌ గురువారం పేర్కొంది. ఆ చట్ట పరమైన అంశాలు ఏమిటన్నవి మాత్రం గోప్యంగా ఉంచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఈ భారతీయుడే ఇప్పుడు అమెరికా హీరో!

ముక్కూ ముఖం తెలియకపోయినా 70 మందికి పైగా అమెరికన్లకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించిన భారతీయ సంతతి వ్యాపారవేత్తను... హీరో అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పోలీసుల చేతిలో మరణించిన ఆఫ్రికన్‌-అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా వేల మంది అమెరికా వీధుల్లో ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు వెంట తరిమిన తమకు రాహుల్‌ దూబె ఆశ్రయం కల్పించారంటూ నిరసన కారుల్లో ఒకరు ట్వీట్‌ చేయటంతో ఈయన గురించి ప్రపంచానికి తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.