close

తాజా వార్తలు

Updated : 05/06/2020 22:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమెజాన్‌తో విడిపోయే సమయం వచ్చింది 

ట్విటర్‌లో స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్

కాలిఫోర్నియా: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌తో విడిపోయే సమయం వచ్చిందంటూ స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్ గురువారం ట్వీట్ చేశారు. ఈ రెండు సంస్థల యజమానులు అంతరిక్ష పరిశోధనల నిమిత్తం పెట్టుబడులు పెట్టిన బిలియనీర్లు. కాగా, ఇప్పటి కారణం మాత్రం ఓ పుస్తకానికి సంబంధించింది. అమెజాన్‌కు చెందిన కిండిల్‌ పబ్లిషింగ్ డివిజన్ నుంచి ‘అన్‌రిపోర్టెడ్ ట్రూత్స్‌ అబౌట్ కొవిడ్-19 అండ్ లాక్‌డౌన్’ పుస్తకాన్ని తొలగించినట్లు దాని రచయిత ట్వీట్ చేశారు. అమెజాన్‌ సంస్థ పేర్కొననని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న నెపంతో ఆ పుస్తకాన్ని తొలగించినట్లు రచయిత విమర్శించారు. దానికి స్పందనగా మస్క్ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘అమెజాన్‌తో విడిపోయే సమయం ఆసన్నమైంది. గుత్తాధిపాత్యం సరికాదు. అది పిచ్చితనం’ అంటూ వరస ట్వీట్లలో ఆమెజాన్‌పై మండిపడ్డారు. అలాగే ఆ సంస్థ సీఈఓ జెఫ్‌బెజోస్‌ను ట్యాగ్ చేశారు. 

అయితే పుస్తకం తొలగింపు నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తడంతో అమెజాన్ స్పందించింది. పొరపాటున దాన్ని తొలగించామని, తిరిగి దాన్ని కిండిల్‌ డివిజన్‌లోకి తీసుకున్నట్లు తెలిపింది. కాగా, ఈ ఇద్దరు బిలియనీర్లు అంతరిక్ష పరిశోధనల రంగానికి చెందిన ప్రత్యర్థులు. ఆ పరిశోధనల కోసం జెఫ్‌బెజోస్‌ ‘బ్లూ ఆరిజిన్‌’ను స్థాపించగా, అంతకు ఎనిమిది సంవత్సరాల క్రితమే ‘స్పేస్‌ ఎక్స్’‌ సంస్థకు మస్క్ పునాది వేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.