close

తాజా వార్తలు

Published : 05/06/2020 20:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 PM

1. కరోనా పరీక్షల సంఖ్య పెంచుతాం: ఈటల

కరోనా నియంత్రణ చర్యల్లో రాష్ట్రం ముందంజలో ఉందని.. రాబోయే కాలంలో కరోనా పరీక్షల సంఖ్య మరింత పెంచుతామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గాంధీ వైద్యుల సేవలు, కృషిని అందరూ అభినందించాలన్నారు. వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కరోనా ఆస్పత్రుల్లో రెండంచెల విధానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. పెట్టుబడుల విషయంలో పారదర్శకత ఉండాలి

రాష్ట్రంలో ఇండస్ట్రియల్‌ పార్కు, క్లస్టర్ల ఏర్పాటుకు పెద్దపీట వేయాలని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డుపై జగన్‌ సమీక్షించారు. వందలాది కోట్ల రూపాయలను ఖర్చుచేసి పరిశ్రమను పెడుతున్నప్పుడు అనుకున్న సమయానికి అది ప్రారంభమయ్యేలా చూడటమే పెట్టుబడిదారులకు అతిపెద్ద ప్రోత్సాహమని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి స్థిరమైన పెట్టుబడులు రావాలన్నా, పదికాలాలపాటు పరిశ్రమలు చక్కగా నడవాలన్నా అందుకు అనుకూలంగా పారదర్శకతతో ఉండాలని జగన్‌ పేర్కొన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. స్థల వివాదం వల్లే విజయవాడ గ్యాంగ్‌వార్‌

యనమలకుదురులోని 7 సెంట్ల స్థల వివాదం పటమటలో రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్‌కు దారి తీసిందని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈ ఘర్షణకు సంబంధించి ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేసినట్లు సీపీ చెప్పారు. విజయవాడ పటమటలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్‌కు సంబంధించిన వివరాలను సీపీ మీడియాకు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. సివిల్స్‌ పరీక్షల తేదీ ఖరారు  

యూపీఎస్సీ 2020 సంవత్సరానికి నిర్వహించాల్సిన పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఈ మేరకు అక్టోబరు 4, 2020న యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష, జనవరి 8, 2021 తేదీన మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షను మే 31న నిర్వహించాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. వారిని 15రోజుల్లోనే తరలించాలి: సుప్రీం

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కూలీలను తరలించే ప్రక్రియను మరో 15రోజుల్లో పూర్తిచేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు సూచించింది. వలస కూలీలు సొంత రాష్ట్రాలకు చేరుకున్న అనంతరం వారి పూర్తి వివరాలు గ్రామాల వారీగా నమోదు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. కరోనా వైరస్‌: ఏటీఎంలలో ఇలా డ్రా చేసుకోవచ్చా?

కరోనా వైరస్‌ విజృంభణతో ఏది తాకాలన్నా భయం వేస్తోంది. డబ్బుల కోసం ఏటీఎంకు వెళ్లాలన్నా చాలా మంది తటపటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు సాంకేతికతను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా కాంటాక్ట్‌లెస్‌ సదుపాయాన్ని తీసుకురావాలని యోచిస్తున్నాయట. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రొటోటైప్‌ను ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌ తయారు చేసింది. బ్యాంకుకు చెందిన మొబైల్‌ యాప్‌ను ఏటీఎం స్క్రీన్‌పై కనిపించే క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌చేయడం ద్వారా మనకు కావాల్సిన మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఆ టీచర్‌ సంపాదన ఏడాదికి రూ.కోటి! నిజమేనా?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు వేతనంగా రూ.కోటి అందుకున్నట్లు వార్తలు రావడం సర్వత్ర చర్చనీయాంశమైంది. ఒక ఏడాదిలో ఆమె 25 పాఠశాలల్లో పనిచేయడం ద్వారా ఈ మొత్తాన్ని ఆర్జించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ ఘటనపై ఆ రాష్ట్ర విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. వారు పరీక్షల నుంచి మినహాయింపు కోరవచ్చు

స్క్రైబ్‌ సాయం కావాల్సిన ప్రత్యేక అవసరాలు గల(చిల్డ్రన్‌ విత్‌ స్పెషల్‌ నీడ్స్‌-సీడబ్ల్యూఎస్‌ఎన్‌) 10, 12వ తరగతి విద్యార్థులు కావాలంటే బోర్డు పరీక్షల నుంచి మినహాయింపు కోరవచ్చని సీబీఎస్‌ఈ వెల్లడించింది. అలాంటి వారి ఫలితాలను ప్రత్యామ్నాయ పద్దతుల ద్వారా లెక్కగడతామని స్పష్టం చేసింది. అయితే, ఏ పద్దతిని అవలంబించాలన్నది నిపుణులను సంప్రదించి బోర్డు నిర్ణయిస్తుందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. లాక్‌డౌన్‌లో కోహ్లీ ఇన్‌స్టా ఆదాయం ఎంతంటే?

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ లాక్‌డౌన్‌ కాలంలోనూ రికార్డు సృష్టించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా లక్షల పౌండ్లు ఆర్జించాడు. లాక్‌డౌన్‌లో ఇన్‌స్టా ద్వారా అత్యధిక మొత్తం ఆర్జించిన క్రీడాకారుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.  అంతేకాదు.. టాప్-10లో ఉన్న ఏకైక క్రికెటర్‌ అతడే కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.