గులాబీ తెచ్చిన అందం
close

తాజా వార్తలు

Published : 06/06/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గులాబీ తెచ్చిన అందం

ఇంట్లో ఉండి అందాన్ని మెరుగుపరుచుకోవడానికి సులువుగా ఉపయోగించుకునే వాటిలో గులాబీలూ ఉంటాయి. వాటిని ఎలా వాడుకోవాలి? వాటితో ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం...
సాయనాలు వాడని గులాబీ రేకల్ని గుప్పెడు తీసుకోవాలి. వాటిని మెత్తగా నూరి, చెంచా పంచదార, కాస్త తేనె, చెంచా పాలపొడి కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దితే...మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.
* కొన్ని రోజా పూలరేకలు, గుప్పెడు తులసి ఆకుల్ని ఓ పెద్ద చెంబు నీళ్లలో వేసి మరిగించాలి. ఈ నీటితో ముఖం తరచూ కడుక్కుంటే ముఖంపై మొటిమలు తగ్గుతాయి. వాటి తాలూకు మచ్చలూ దూరం అవుతాయి.
* నాలుగైదు గులాబీల పూల రేకలు, పావుకప్పు పెసరపిండి, చెంచా వట్టివేళ్ల పొడి, చెంచా పాలు తీసుకుని ముఖానికి పూత వేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగిన తేమ అంది తాజాగా కనిపిస్తుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని