మారుతీ సుజుకీ 5 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంటు
close

తాజా వార్తలు

Updated : 06/06/2020 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మారుతీ సుజుకీ 5 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంటు

దిల్లీ: గురుగ్రామ్‌లో 5 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంటులో ఉత్పత్తి ఆరంభమైందని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ప్రకటించింది. సంస్థ స్వీయ విద్యుత్తు అవసరాల కోసం ఈ ప్లాంటు నిర్మించింది. రూ.20 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ ప్లాంటు వల్ల రాబోయే 25 ఏళ్లలో 5390 టన్నుల కార్బన్‌ డైఆక్సైడ్‌ ఉద్గారాల విడుదలను నివారించగలమని భావిస్తున్నట్లు సంస్థ వివరించింది. ఏటా 7010 మెగావాట్‌ అవర్‌ విద్యుత్తును ఈ ప్లాంటు నుంచి పొందగలమని వెల్లడించింది. 2014లో మానేసర్‌ (హరియాణా) ప్లాంటు కోసం 1 మెగావాట్‌ సౌర విద్యుత్తు ప్లాంటును సంస్థ నిర్మించి, తదుపరి ఈ సామర్థ్యాన్ని 1.3 మెగావాట్లకు పెంచింది కూడా.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని