close

తాజా వార్తలు

Published : 06/06/2020 03:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హైకోర్టు ఆదేశాలు పరిశీలిస్తున్నాం: ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌

ఇ-ఓటింగ్‌పై స్టే నేపథ్యం

దిల్లీ: గుజరాత్‌ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిశీలిస్తున్నట్లు ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పేర్కొంది. ఈ సంస్థ నిలిపివేసిన ఆరు డెట్‌ ఫండ్‌ పథకాల నిమిత్తం చేపట్టిన ఇ-ఓటింగ్‌ ప్రక్రియపై కోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్‌ 9-11 మధ్య ఇ-ఓటింగ్‌; జూన్‌ 12న యూనిట్‌ హోల్డర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ జరగాల్సి ఉంది. అయితే   పథకాల నిలిపివేత చట్టవ్యతిరేకమంటూ గుజరాత్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా, కోర్టు స్టే ఇచ్చింది. ‘ప్రస్తుతం మేం ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాం. తగిన సమయంలో.. తగిన చర్యలు చేపడతామ’ని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఎమ్‌ఎఫ్‌ ప్రతినిధి ఒకరు స్టే ఆర్డరుపై స్పందించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.