close

తాజా వార్తలు

Published : 06/06/2020 16:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బఫెట్‌ తప్పులో కాలేశారు!: ట్రంప్‌

వాషింగ్టన్‌: ప్రపంచ సంపన్నుల్లో ఒకరు, ప్రముఖ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ తప్పులో కాలేశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఎయిర్‌లైన్స్‌ రంగంలో తన కంపెనీ వాటాలను బఫెట్‌ విక్రయించి తప్పు చేశారని వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో ఎయిర్‌లైన్స్‌ షేర్లు భారీగా పుంజుకున్న నేపథ్యంలో శ్వేతసౌధం వద్ద మీడియాతో మాట్లాడుతూ ట్రంప్‌ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘బఫెట్‌ అంటే నాకెంతో గౌరవం. ఆయన తన జీవిత కాలం ఒప్పులే చేశారు. కానీ ఇటీవలే ఎయిర్‌లైన్స్‌ షేర్లు విక్రయించి తప్పు చేశారు. బఫెట్ వంటి వారు కూడా అప్పుడప్పుడూ తప్పులు చేస్తుంటారు’’ అని ట్రంప్‌ అన్నారు. ఎయిర్‌లైన్స్‌ షేర్లు ఇవాళ ఆకాశాన్ని తాకుతున్నాయని, అలాంటి వారు షేర్లను తెగనమ్ముకోకుండా ఉండాల్సిందని బఫెట్‌ నుంచి వ్యాఖ్యలు చేశారు.

గత నెల వారెన్‌ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ వార్షిక సమావేశంలో తమకున్న ఎయిర్‌లైన్స్‌ షేర్ల మొత్తాన్ని విక్రయిస్తున్నట్లు బఫెట్‌ పేర్కొన్నారు. కరోనా కారణంగా విమానాయాన పరిశ్రమ దెబ్బతిన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అమెరికా విమానయాన సంస్థలైన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌, డెల్టా ఎయిర్‌లైన్స్‌, సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ షేర్లలో సుమారు 7-8 బిలియన్‌ డాలర్ల మేర ఆ కంపెనీకి వాటాలున్నాయి. అయితే, గత మూడు రోజులుగా ఎయిర్‌లైన్స్‌ షేర్లు భారీ లాభాల్లో పయనిస్తున్నాయి. ఒక్క అమెరికకన్‌ ఎయిర్‌లైన్స్‌ షేర్లే గత మూడు సెషన్లలో 57 శాతం పుంజుకున్నాయి. మిగిలిన కంపెనీల షేర్లు కూడా లాభాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో బఫెట్‌ తప్పులో కాలేశారని ట్రంప్‌ అన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని