జిడ్డుని తొలగించే గ్రీన్‌ టీ
close

తాజా వార్తలు

Published : 07/06/2020 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జిడ్డుని తొలగించే గ్రీన్‌ టీ

నలుగురిలోనూ అందంగా మెరిసిపోవాలని ఎవరనుకోరు? ఇంట్లో ఉండే వాటితోనే మోమును మెరిపిద్దామిలా..!
టేబుల్‌స్పూన్‌ సెనగపిండి, అరచెంచా తేనె, కొద్దిగా పాలు...చిటికెడు పసుపు కలిపి ముఖం, మెడ, చేతులకు పూతలా వేసుకోవాలి. ఇలా పదినిమిషాల పాటు ఆరనిచ్చి ముఖం కడిగేసుకోవాలి. అలానే పాలకి బదులుగా పెరుగూ కలపొచ్చు. ఈ ప్యాక్‌ వల్ల మృతకణాలు తొలగి చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.
*చర్మం పొడిబారినప్పుడు నాలుగు బాదం గింజల్ని నానబెట్టి మెత్తగా చేయాలి. దానికి పాలు, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరనివ్వాలి. దీన్ని కళ్లకింద రాసుకున్నా...నల్లటి వలయాలు పోతాయి. 

* వేడినీళ్లలో గ్రీన్‌టీ బ్యాగుని నాననివ్వాలి. ఆ బ్యాగుని బయటకు తీసి ఆ గ్రీన్‌టీ మిశ్రమంలో అరచెక్క నిమ్మరసం కలిపితే సరి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మగ్రంథుల లోపలికి చొచ్చుకుని పోయి శుభ్రపడుతుంది. దీనికి చెంచా తేనె చేర్చితే జిడ్డుతొలగి కాంతిమంతంగా కనిపిస్తుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని