close

తాజా వార్తలు

Published : 12/06/2020 23:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి బ్రిటన్‌..!

లండన్‌: బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థలో భారీ కుంగుబాటు చోటు చేసుకొంది. దేశం కరోనావైరస్‌ లాక్‌డౌన్‌లో ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అధికారిక లెక్కల ప్రకారం జీడీపీ వృద్ధిరేటు ఏప్రిల్‌ నెలలో -20.4శాతంగా నమోదైంది. ఈ విషయాన్ని ఆఫీస్‌ ఫర్‌ నేషనల్‌ స్టాటిస్టిక్‌స్‌ వెల్లడించింది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు చూస్తే ఇది -10.4శాతంగా ఉంది.

ఈ స్థాయిలో జీడీపీ పతనం బ్రిటన్‌ ఎన్నడూ చవిచూడలేదని డిప్యూటీ నేషనల్‌ స్టాటిస్టియన్‌ జోనాథన్‌ ఆథ్వో వెల్లడించారు. ఫిబ్రవరితో పోలిస్తే ఏప్రిల్‌ నాటికి ఆర్థిక వ్యవస్థ 25 శాతం తగ్గిపోయిందన్నారు. దీంతే దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి జారుకొంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే -2శాతంగా ఉంది. ఆ తర్వాత కొవిడ్‌ కారణంగా భారీగా పతనం అయింది. ఏప్రిల్‌-జూన్‌ లెక్కలు వస్తే దేశం భారీగా ఆర్థిక మాంద్యంలోకి జారుకొందన్న విషయం అధికారికమవుతుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.