close

తాజా వార్తలు

Published : 15/06/2020 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కలిసి ఉండగా చూశాడని కడతేర్చాడు!

కళాశాల విద్యార్థినితో విద్యార్థి ప్రేమాయణం

● విషయం బయటపడకుండా బాలుడి హత్య

చెన్నై: ప్రియురాలితో కలిసి ఉండగా చూశాడని అభం శుభం తెలియని బాలుణ్ని ఓ కళాశాల విద్యార్థి దారుణంగా చంపేశాడు. పోలీసుల కథనం ప్రకారం... తమిళనాడులోని తిరుప్పూర్‌ జిల్లా ఊత్తుకులి సమీపం సొట్టకవుండమ్‌పాలయం సమీప ప్రాంతానికి చెందిన తంగరాజ్‌- సుమతి దంపతులకు కుమారులు విఘ్నేష్‌ (9), పవనేష్‌ (8) ఉన్నారు. దంపతులు ఓ బనియన్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. ఉదయాన్నే పనులకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో వారు పనికి వెళ్లాక పవనేష్‌ అదృశ్యమయ్యాడు. పని ముగించుకొని ఇంటి వచ్చాక ఆ దంపతులు పలు చోట్ల వెతికారు. ఊత్తుకులి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక చెరువు ప్రాంతంలో పవనేష్‌ మృతదేహం కనిపించింది. కడుపు, గొంతు భాగాలలో పొడిచి బాలుణ్ని చంపినట్లు పోలీసులు తెలిపారు. ఏడు ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు చేపట్టారు. పవనేష్‌ ఇంటికి సమీపంలో ఉంటున్న ఓ కళాశాల విద్యార్థిని.. తన ప్రియుడైన పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థితో కలిసి బయటకు వెళ్లింది. అనంతరం వాళ్లు అదే ప్రాంతంలోని చెరువు వద్ద సన్నిహితంగా ఉండడాన్ని పవనేష్‌ చూశాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడ్డారు. దీంతో పవనేష్‌ను ఆ విద్యార్థి కత్తితో పొడిచి చంపేసి పొదల్లో పడేశాడని వెల్లడైంది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.