తెలంగాణలో 213 కరోనా పాజిటివ్‌ కేసులు
close

తాజా వార్తలు

Updated : 16/06/2020 23:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో 213 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 213 కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5,406కు చేరుకుంది. తాజాగా మరో నలుగురు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 191కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. ఈ రోజు మొత్తం 1,251 మందిని పరీక్షించారు. 261 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పటి వరకు 3027 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రల్లో 2,188 మంది చికిత్స పొందుతున్నారు. ఈ రోజు అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 165 కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డిలో 16, మెదక్‌లో 13, కరీంనగర్‌లో 6, మేడ్చల్‌లో 3, నిజామాబాద్‌లో 2, సంగారెడ్డిలో 2, జనగామ, కామారెడ్డి, పెద్దపల్లి, సిద్దిపేట, కుమ్రం భీం అసిఫాబాద్‌, యాదాద్రి భువనగిరిలో ఒక్కో కేసు నమోదు అయ్యింది. ఇప్పటివరకు తెలంగాణలో 44,431 మందికి టెస్టులు నిర్వహించారు.   


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని