స్టాక్‌మార్కెట్లకు భారీ లాభాలు
close

తాజా వార్తలు

Published : 18/06/2020 16:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టాక్‌మార్కెట్లకు భారీ లాభాలు

ముంబయి: బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, లోహ షేర్ల అండతో దేశీయ మార్కెట్లు గురువారం భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌700 పాయింట్లు లాభపడి, 34,208 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌నిఫ్టీ 210 పాయింట్ల లాభంతో 10వేల మార్కును దాటి స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 76.14 కొనసాగుతోంది. 
గురువారం ఉదయం దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.  భారత్‌-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టులో విచారణతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఆ తర్వాత సూచీలు నెమ్మదిగా కోలుకున్నాయి. ఒకానొక దశలో సెన్సెక్స్‌ 34,276 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరకు 700 పాయింట్ల లాభంతో 34,208 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 10వేల మార్కును దాటి 210 పాయింట్ల లాభంతో 10,091 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీలో బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, కోల్‌ఇండియా, జీ ఎంటర్‌టైన్‌, వేదాంత తదితర షేర్లు లాభపడగా, ఓఎన్‌జీసీ, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో మొదలైన షేర్లు నష్టాలను చవిచూశాయి. 
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని