భారత్‌కు జీఎస్పీ హోదా?
close

తాజా వార్తలు

Updated : 19/06/2020 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌కు జీఎస్పీ హోదా?

చర్చలు జరుపుతున్నామన్న అమెరికా

వాషింగ్టన్‌: భారత్‌కు గతంలో రద్దు చేసిన ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ)ను పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఈ మేరకు భారత్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. జీఎస్పీ లబ్ధికి ప్రతిగా ఇండియా నుంచి సరైన ప్రతిపాదనలు వస్తే పునరుద్ధరణ దిశగా వేగంగా అడుగులు పడతాయని పేర్కొంది. 

వాషింగ్టన్‌కు చెందిన ఓ ప్రతినిధి చట్టసభలో మాట్లాడుతూ.. యాపిల్‌ పండ్లపై భారత్‌ 70 శాతం సుంకాలు విధిస్తోందని తెలిపారు. దీని నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలని ప్రశ్నించారు. మరో ప్రతినిధి మాట్లాడుతూ.. పప్పు దినుసులపై కూడా భారత్‌ సుంకాలు పెంచిందని గుర్తుచేశారు. ఇండియాలో దినుసులకు భారీ గిరాకీ ఉందని పేర్కొన్నారు. కానీ, సుంకాల పెంపు వల్ల అమెరికా రైతులు నష్టపోతున్నారన్నారు. ఇలా పలువురు ప్రతినిధులు భారత్‌కు జీఎస్పీ రద్దు చేయడం వల్ల కలుగుతున్న నష్టాన్ని తెరమీదకు తెచ్చారు. దీనికి బదులిస్తూ వాణిజ్య ప్రతినిధి‌ రాబర్ట్‌ లైటైజర్‌ గురువారం జీఎస్పీ పునరుద్ధరణ దిశగా జరుగుతున్న ప్రయత్నాల్ని వివరించారు. జీఎస్పీ రద్దుకు ప్రతిగా భారత్‌ విధించిన సుంకాలు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అందుకే తిరిగి దాన్ని పునరుద్ధరించేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు. అలాగే భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగానూ చర్చలు జరుగుతున్నట్లు ట్రంప్‌ పాలకవర్గంలోని మరో అధికారి తెలిపారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని