బరువు తగ్గించే నిమ్మగడ్డి
close

తాజా వార్తలు

Published : 20/06/2020 00:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బరువు తగ్గించే నిమ్మగడ్డి

చక్కని పరిమళాన్ని వెదజల్లే నిమ్మగడ్డి మనలో ఒత్తిడిని తగ్గిస్తుంది. హాయిగా నిద్రపోయేలా చేస్తుంది. వ్యాధినిరోధక శక్తినీ పెంచుతుంది..  
యాంటీ ఆక్సిడెంట్లు: దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యాధికారక ఫ్రీరాడికల్స్‌తో పోరాడేందుకు సాయపడతాయి.
జీర్ణశక్తికి: నిమ్మగడ్డితో చేసిన టీని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది.
క్రిమినాశని: ఇది క్రిమినాశనిగా పనిచేస్తుంది. నోటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది.
బరువు నియంత్రణ: దీంతో చేసిన టీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. రోజువిడిచి రోజు దీంతో చేసిన టీ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
మంటలను తగ్గిస్తుంది: నిమ్మగడ్డిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల మంటలు తగ్గుతాయి. దీంట్లో ఉండే ఎసెన్షియల్‌ నూనెలు సాంత్వన కలిగిస్తాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని