ఆఖర్లో అమ్మకాలు.. అయినా లాభాలు
close

తాజా వార్తలు

Updated : 22/06/2020 18:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆఖర్లో అమ్మకాలు.. అయినా లాభాలు

ముంబయి: దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. చివరి గంటలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో ఇంట్రాడే గరిష్ఠాలకు చేరిన సూచీలు ఒక్కసారిగా పడిపోయాయి. బ్యాంకింగ్‌, లోహ, ఫార్మా షేర్ల అండంతో చివరకు లాభాలతోనే ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 179 పాయింట్లు లాభపడి 34,911 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 10,300 స్థాయిని దాటింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.76.02 వద్ద కొనసాగుతోంది.

ఉదయం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 332 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 108 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. మార్కెట్లోకి కొవిడ్‌ చికిత్సలో ఆశాజనక ఫలితాలిస్తున్నాయని భావిస్తున్న రెమ్‌డెసివిర్‌, ఫవిపిరవిర్‌ ఔషధాలు అందుబాటులోకి రానుండటంతో ఫార్మా షేర్లు భారీగా పుంజుకున్నాయి. వీటికి బ్యాంకింగ్‌ రంగ షేర్లు కూడా తోడవడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. ఒకానొక దశలో సెన్సెక్స్‌  35,213 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు పతనమవుతూ వచ్చాయి. సెన్సెక్స్‌ ఏకంగా 34,794 పాయింట్లకు పడిపోయింది. అయితే, చివరిలో కాస్త కోలుకుని 179 పాయింట్ల లాభంతో 34,911 వద్ద ముగిసింది. 66 పాయింట్ల లాభంతో నిఫ్టీ 10,311 వద్ద ముగిసింది.

సోమవారం నాటి ట్రేడింగ్‌లో బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కోల్‌ ఇండియా, వేదాంత తదితర షేర్లు లాభపడగా, విప్రో, గెయిల్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని