ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించిన పిచాయ్‌
close

తాజా వార్తలు

Published : 23/06/2020 12:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించిన పిచాయ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: హెచ్-‌1బీ వీసాల జారీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొన్న కొత్త నిర్ణయాన్ని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ వ్యతిరేకించారు. ఈ ఏడాది చివరివరకూ వలసదార్ల వీసాలను తాత్కాలికంగా రద్దు చేయడం సరైన నిర్ణయంకాదన్నారు. అమెరికా వలసదార్ల వీసాలకు సంబంధించి సోమవారం శ్వేతసౌధం కీలక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పిచాయ్‌ ఆ ప్రకటనను ఖండిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. 

అమెరికా ఆర్థిక బలోపేతానికి వలసవిధానమే విశేషంగా కృషి చేసిందని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టిందని చెప్పారు. అలాగే గూగుల్‌ ఇప్పుడున్న స్థితికి కూడా ఆ విధానమే కారణమని పేర్కొన్నారు. కొత్త నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురైనట్లు ఆయన విచారం వ్యక్తం చేశారు. వలసదార్లకు తాము అండగా ఉంటామని, అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషిచేస్తామని పేర్కొన్నారు. కాగా, తమ పౌరులకు తొలి ప్రాధాన్యంగా ఉద్యాగాలు కల్పించడానికే కొత్త నిర్ణయం తీసుకున్నట్లు శ్వేతసౌధం పేర్కొంది. ఇంతకుముందులా లాటరీ విధానం కాకుండా, గరిష్ట వేతన మూలంగా హెచ్‌-1బీ వీసాలు జారీ చేస్తామని చెప్పింది. ఇది భారతీయ ఐటీ నిపుణులపై పెనుప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని