అసలు ట్రంప్‌కు ఎవరు చెప్పారు..!
close

తాజా వార్తలు

Updated : 24/06/2020 11:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అసలు ట్రంప్‌కు ఎవరు చెప్పారు..!

 అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఫౌచీ

వాషింగ్టన్: ట్రంప్‌ నోటి దురుసు మరోసారి అమెరికాకు తలనొప్పి తెచ్చింది. ఆయన ఇటీవల ఓక్లహోమాలో ఒక ర్యాలీలో మాట్లాడుతూ కరోనా పరీక్షలను తగ్గించాలని తన కార్యవర్గాన్ని ఆదేశించారు. దీనిపై అమెరికాలోని ది నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ అలెర్జీ అండ్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ అసహనం వ్యక్తంచేశారు. కొవిడ్‌ వ్యాప్తిపై అమెరికా కాంగ్రెస్‌ కమిటీ చేపట్టిన దర్యాప్తు సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు.  ‘‘ నాకు తెలిసినంత వరకు మాలో ఎవరూ కరోనా పరీక్షలను తగ్గించమని చెప్పలేదు. మేము ఇంకా పెంచాలని ప్రభుత్వానికి సూచించాము’’ అని ఆయన కాంగ్రెస్ కమిటీకి వివరణ ఇచ్చుకున్నారు. త్వరలో అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఫౌచీ ఆందోళన వ్యక్తంచేశారు. రానున్న రోజులు అమెరికాకు గడ్డుకాలమని ఫౌచీతో పాటు ప్యానల్‌ సభ్యులు కూడా అభిప్రాయపడ్డారు. 

 ఆయనతో పాటు ఈ విచారణకు సీడీసీ, ఎఫ్‌డీఏ, ది డిపార్ట్‌మెంట్‌  ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీస్‌ అధికారులు కూడా హాజరయ్యారు. టెస్టుల తగ్గింపుపై తాము ట్రంప్‌కు సలహా ఇవ్వలేదని వీరంతా వెల్లడించారు. 

వైట్‌ హౌస్‌ వివరణ ఇచ్చినా..

మరోవైపు, ట్రంప్ వ్యాఖ్యలను సరిచేసేందుకు వైట్‌హౌస్‌ ప్రయత్నించింది. ఆయన కేవలం సరదాగా అన్నారని వివరణ ఇచ్చింది. కానీ, మంగళవారం ట్రంప్ మాట్లాడుతూ తాను జోక్‌ చేయడంలేదని చెప్పారు. దీంతోపాటు ఆయన ఫినిక్స్, అరిజోనాల్లో మాట్లాడుతూ ‘కరోనా వైరస్‌ అదే వెళ్లిపోతుంది’ అని వ్యాఖ్యానించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని