భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
close

తాజా వార్తలు

Published : 24/06/2020 16:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 561 పాయింట్లు నష్టపోయి 34,868 వద్ద, నిఫ్టీ 165 పాయింట్లు నష్టపోయి 10,305 పాయింట్లకు చేరింది. ఉదయం లాభాలతో మొదలైన మార్కెట్లు మధ్యాహ్నం వరకు లాభాల్లో కొనసాగి.. ఆ  తర్వాత నష్టాల్లోకి జారుకొన్నాయి. ముఖ్యంగా ఎఫ్‌అండ్‌వోలు సెటిల్మెంట్లు ఉండటంతో ఇన్వెస్టర్లు విక్రయాలు జరిపారు.

మంగళూరు రిఫైనరీ, హ్యూస్టన్‌ ఆగ్రో, పేజ్‌ ఇండస్ట్రీస్‌, సెంట్రమ్‌ క్యాపిటల్‌, జమ్ము అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌ లాభపడగా.. ఇండియాబుల్స్ హౌసింగ్‌ ఫైనాన్స్‌, యూనియన్‌ బ్యాంక్‌, ఇన్ఫోఎడ్జ్‌, టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ నష్టపోయాయి.  

ముఖ్యంగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు ప్రతికూలంగా ఉండటం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. దీంతోపాటు త్రైమాసిక ఫలితాలు కూడా ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించి విక్రయాలు జరిపారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని