close

తాజా వార్తలు

Published : 25/06/2020 02:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెట్రో భారాన్ని మోయాల్సిందేనా?

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశాన్ని నడిపించాలంటే ప్రభుత్వానికి ఆదాయం రావాలి, దీని కోసం ప్రజలపై పున్నులు విధించాలి. అవి హేతుబద్ధంగా, సామాన్యుడు భరించగలిగేలా ఉండాలి. మరి దేశ చరిత్రలోనే వరుసగా 18వ రోజు పెరిగిన పెట్రోలియం ఉత్పత్తుల ధరల వెనుక హేతుబద్ధత ఎంత..? ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా.. దేశ ప్రజలపై ఏమిటీ పెనుభారం. నొప్పి తెలియకుండా పైసల్లో పెంచుతున్నా, కొండలా మారుతున్న ఈ పెట్రో భారాన్ని ఇక భరిస్తూ ఉండాల్సిందేనా?  

ఏ వ్యాపారంలోనైనా లాభం  ప్రాథమిక సూత్రం. వ్యాపార సంస్థలు లాభం అనే ప్రాథమిక సూత్రం ఆధారంగానే క్రయవిక్రయాలు జరుపుతూ ఉంటాయి. ముడి చమురును ఉత్పత్తి చేసే సంస్థలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. భారతదేశ పెట్రో ఉత్పత్తుల అవసరాలకు సుమారు 70 శాతం విదేశాల నుంచి వచ్చే దిగుమతులే ఆధారం. అయితే అంతర్జాతీయ కంపెనీలు, దేశీయ చమురు కంపెనీలకు అమ్ముతున్న ధరకు, ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న ధరల మధ్య తేడాను చూస్తే అది భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా తగ్గినా భారత్‌లో మాత్రం పెట్రోల్‌, డీజిల్ ధరలు అమాంతం పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ ధరల్లో తగ్గుదల సామాన్యుడికి ఏ మాత్రం బదిలీ కావడంలేదు. లాక్‌డౌన్‌ సడలింపులు తరువాత కేంద్ర ప్రభుత్వం జూన్‌ 7 నుంచి పెట్రోల్‌, డీజిల్ ధరలు పెంచడం ఆరంభించగా దేశ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 18వ రోజూ వాటి ధరలు పెరిగాయి. ఇక దేశ రాజధాని దిల్లీలో డీజిల్‌ ధర పెట్రోల్‌ ధరను దాటిపోవడం సామాన్యుడు మోస్తున్న పెనుభారానికి అద్దం పడుతోంది.

బండి తీయాలంటే ఆలోచించాల్సిందే!

వ్యక్తిగత వాహనం సామాన్యుడికి దాదాపు నిత్యావసరం. బస్సులు రైళ్లు, క్యాబ్‌లు, ట్యాక్సీలు అందుబాటులో ఉన్నప్పటికీ దేశంలోని అనేక మంది సొంతవాహనానికే మొగ్గు చూపుతారు. ఈ బండి బయటకు తీస్తేనే బతుకు అనే బండి నడిచేది. అయితే లాక్‌డౌన్‌ సడలింపులు తర్వాత 18రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో ఇక బండి బయటకు తీయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశీయ చమురు కంపెనీలు జూన్‌ 7న పెట్రోల్‌, డీజీల్‌ ధరలను సవరిస్తామని ప్రకటించి, ఆ రోజు నుంచి పెంపు ప్రారంభించగా ఈ 18 రోజుల్లో కలిపి పెట్రోల్‌ ధర లీటరుకు రూ.9.41 పైసలు, లీటర్‌ డీజీల్‌ ధర రూ.9.58 పైసలు పెరిగింది. ఈ స్వల్ప వ్యవధిలో ఈ స్థాయిలో పెంపు ఉండటం ఇదే తొలిసారి. దేశ రాజదాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.79.76 పైసలు ఉండగా, డీజిల్ ధర రూ.79.88 పైసలకు చేరుకుంది. తొలిసారిగా డీజిల్‌ ధర, పెట్రోల్‌ ధరలను మించిపోయాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల వెనుక కారణాలు తరచి చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే అధిక పన్నులు, డీలర్ల కమిషన్లే కారణం. 

సుంకాలు పెంచడమే కారణం! 

అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ ముడిచమురు ధర ప్రస్తుతం 42 డాలర్ల పైనే ఉంది. దాన్ని ప్రకారం చూస్తే భారత్‌ కరెన్సీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.22  పైన ఉంటుంది. అయితే అధిక సుంకాల కారణంగా కొనుగోలు దారుడి స్థాయికి వచ్చేటప్పటికి దాని ధర ఏకంగా అనేక రెట్లు పెరిగిపోతుంది. ఇంధనాల రేట్ల దాదాపు 60 శాతం పైగా భాగాన్ని సుంకాలే ఆక్రమిస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీ సంగతి తీసుకుంటే లీటరు పెట్రోల్‌ వాస్తవ ధర దాదాపు రూ. 22.50  కాగా వ్యాట్‌ ఎక్సైజు సుంకం డీలర్ల కమిషన్‌ ఇవన్నీ కలిపితే రిటైల్‌ రేటు ప్రస్తుతం రూ.79.76 పైసలు కు చేరింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజు సుంకం పెట్రోల్‌ పై  లీటరుకు రూ.32.98 పైసలుగా, డీజిల్‌పై లీటరుకు రూ. 31.83 పైసలుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే విలువ ఆధారిత పన్ను రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, కేరళ, కర్ణాటకల్లో అత్యధికంగా 30 శాతం వ్యాట్‌ విధిస్తునట్టు గణాంకాలు చెబుతున్నాయి. డీలర్‌ కమీషన్‌ విషయానికి వస్తే పెట్రోల్‌ బంకు ఉన్న ప్రాంతాన్ని బట్టి ఇది రూ. 2 నుంచి రూ.4 మధ్య ఉంటుంది. దీని సంగతి తీసుకుంటే పెట్రోల్‌పై డీలర్‌ కమిషన్‌ లీటరుకు రూ.3.57 పైసలుగా, డీజిల్‌పై రూ. 2.51 పైసలుగా ఉంది. పెట్రోలియం రంగంపై పన్నులతో కేంద్రానికి ఏటా రూ.3.48 లక్షల కోట్లు. రాష్ట్రాలకు 2.22 లక్షల కోట్లు వస్తాయిని గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ముడిచమురు ధరలు ప్రస్తుతం 42 డాలర్లు ఉండగా, గతంలో 105 డాలర్లకు చేరిన సమయంలోనూ దేశంలో పెట్రోల్‌ ధరలు ఇప్పటికంటే తక్కువగా ఉన్నాయి. దీనికి కారణం అప్పటితో పోలీస్తే సుంకాలు ఇప్పుడు భారీగా పెంచడమే.

పన్నులు తగ్గేనా?

యూపీఏ హాయంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.20 పైసలు ఉన్న ఎక్సైజు సుంకాన్ని ఎన్డీయే ప్రభుత్వం విడతల వారీగా రూ.32.98 పైసలకు, లీటర్‌ డీజిల్‌పై కేవలం రూ.3.46 పైసలుగా ఉన్న ఎక్సైజు సుంకాన్ని రూ.31.83 పైసలకు పెంచింది. యూపీఏ హాయంతో పోల్చుకుంటే, పెట్రోల్‌పై ఎక్సైజు సుంకం 258.47 శాతం డీజిల్‌పై 819.94 శాతం పెరిగింది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడంలో ఇదీ ఒక ప్రధాన కారణమే. అయితే ప్రభుత్వ వర్గాల వాదన మాత్రం పెట్రో ధరల పెంపు ద్వారా ఏటా వచ్చే లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రస్తుత కరోనా క్లిష్ట సమయంలో మౌలిక సదుపాయాల కల్పనతో సహా ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు మళ్లీస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపధ్యంలో ఇంధనాలపై సుంకాలు, పన్నులు తగ్గించే అస్కారం ఉండకపోవచ్చని వెల్లడించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.