close

తాజా వార్తలు

Published : 25/06/2020 09:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెదేపా నేత మంచాల రమేష్‌పై హత్యాయత్నం

తెనాలి టౌన్ : గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఐతానగర్‌లో తెదేపా నేత మంచాల రమేష్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రమేష్‌ను ఇంట్లో నుంచి బయటకు పిలిచి ఘర్షణకు దిగారు. అడ్డుగా వెళ్లిన రమేష్‌ సోదరుడు సతీష్‌ మెడపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో సతీష్‌ స్వల్పంగా గాయపడ్డారు. బాధితుడిని తెనాలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న తెనాలి రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
మంచాల రమేష్‌ కుమార్తె తెనాలి పట్టణం 39వ వార్డులో కౌన్సిలర్‌గా పోటీచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగిందని బాధితుడు ఆరోపిస్తున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.