ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ షేర్ల ర్యాలీ
close

తాజా వార్తలు

Published : 25/06/2020 15:23 IST

ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ షేర్ల ర్యాలీ

ముంబయి: ఇండియా ఇన్ఫోలైన్‌ ఫైనాన్స్ సంస్థ షేర్లు గురువారం భారీగా ర్యాలీ చేశాయి. ఒక దశలో ఇవి 10శాతానికి చేరడంతో అప్పర్‌ సర్క్యూట్‌ విధించారు. అప్పటికి ఇది రూ.82.20 వద్ద ఉంది.  కంపెనీ ప్రమోటర్‌ నిర్మల్‌ జైన్‌ ఓపెన్‌ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేసి కంపెనీలో వాటా పెంచుకొన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో షేరు భారీగా ర్యాలీ చేసింది. 

బుధవారం జైన్‌ 4,54,000 షేర్లను రూ.3.40 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీకి చేసిన ఫైలింగ్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయన వాటా 12.61 నుంచి 12.49కి చేరింది. ఈ విషయం మార్కెట్లో తెలియడంతో ఉదయం నుంచి షేర్ల ధరలు భారీగా పరుగులు తీశాయి. మధ్యాహ్నం 12.03గంటల సమయానికి 14లక్షల షేర్లు చేతులు మారాయి. మరోపక్క ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్ షేర్లు కూడా భారీగా విలువ పెరిగాయి. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని