రెండు రోజుల నష్టాలకు అడ్డుకట్ట...
close

తాజా వార్తలు

Updated : 26/06/2020 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండు రోజుల నష్టాలకు అడ్డుకట్ట...

ముంబయి: దేశీయ మార్కెట్లు వారాంతాన్ని లాభాలతో ముగించాయి. వరుసగా రెండు రోజుల పాటు నష్టాలను చవిచూసిన సూచీలు శుక్రవారం లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 329 పాయింట్లు లాభపడి 35,171 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 10,383 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.75.66 వద్ద కొనసాగుతోంది.

ఉదయం స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. జులై ఎఫ్అండ్వో సిరీస్‌ ప్రారంభమైన నేపథ్యంలో సెన్సెక్స్‌ 266 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను కొనసాగించింది. ఒకానొక దశలో 35,254 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సూచీలు ఆ తర్వాత పడుతూ లేస్తూ సాగాయి. చివరకు సెన్సెక్స్‌ 329 పాయింట్ల లాభంతో 35,171 వద్ద స్థిరపడింది.

శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్‌, బీపీసీఎల్‌, ఐవోసీ, టీసీఎస్‌, ఇండస్‌ఇండ్ బ్యాంకు తదితర షేర్లు లాభపడగా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఐటీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, కొటక్‌ మహీంద్రా మొదలైన షేర్లు నష్టాలను చూవిచూశాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని