close

తాజా వార్తలు

Published : 27/06/2020 00:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎముకల బలానికి... సోయా!

ఎముకలు దృఢంగా ఉంటే ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్ఛు ఇవి బలంగా ఉండటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే...

ఆకుకూరలు: పాలకూర, బ్రకోలీలలోని పోషకాలు ఎముకల దృఢత్వానికే కాకుండా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచీ కాపాడతాయి.

గుమ్మడి గింజలు: వీటిల్లో పుష్కలంగా ఉండే మెగ్నీషియం ఎముకల నిర్మాణానికి తోడ్పడుతుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎముకల బలోపేతం అవడమే కాకుండా ఆస్థియోపోరోసిస్‌ బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఈ గింజల్లో ఉండే మంచి కొవ్వులు అరికాలి మంటలను తగ్గించి ఎముకలను దృఢంగా మారుస్తాయి. రోజుకు ఎనిమిది నుంచి పదమూడు గింజలు వరకూ తినొచ్చు.

సోయాబీన్స్‌: వీటిల్లో అధికంగా ఉండే ప్రొటీన్లు, క్యాల్షియం ఎముకలను బలోపేతం చేస్తాయి. మెనోపాజ్‌ దశలోని మహిళల్లో ఎముకలు బలహీనంగా మారతాయి. వీరు సోయా ఉత్పత్తులను తగిన మోతాదులో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

చేపలు: వీటిల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతోపాటు క్యాల్షియం, విటమిన్‌-డి, విటమిన్‌-బి2 అధికంగా ఉంటాయి. వీటితోపాటూ ఎముకల నిర్మాణానికి అవసరమైన ఫాస్ఫరస్‌, జింక్‌ లాంటి ఖనిజాలూ నిండుగా ఉంటాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.