సీఏపీఎఫ్‌, సీపీఎంఎఫ్‌ సంబంధితులకు కంపెనీలు ఇచ్చే విరాళాలు సీఎస్‌ఆర్‌లోకి
close

తాజా వార్తలు

Published : 29/06/2020 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఏపీఎఫ్‌, సీపీఎంఎఫ్‌ సంబంధితులకు కంపెనీలు ఇచ్చే విరాళాలు సీఎస్‌ఆర్‌లోకి

దిల్లీ: కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్‌), కేంద్ర పారా మిలిటరీ బలగాలు (సీపీఎంఎఫ్‌)కు సంబంధించిన వ్యక్తులు, పదవీ విరమణ చేసిన వారు, వారి సంబంధీకులకు ఇకపై కంపెనీలు ఇచ్చే విరాళాలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లోకి రానున్నాయి. ఇందుకు అనుగుణంగా కంపెనీల చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది. 2013 కంపెనీల చట్టంలోని షెడ్యూల్‌ 7ను కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సవరించి ఈ నెల 23న నోటిఫికేషన్‌ జారీ చేసింది. సీఎస్‌ఆర్‌ కార్యకలాపాల్లోకి వచ్చే వాటిని ఈ షెడ్యూల్‌ వివరిస్తుంది. రూ.500 కోట్ల విలువ, రూ.1000 కోట్ల టర్నోవర్‌ లేదా రూ.5 కోట్ల నికర లాభం కలిగిన కంపెనీ సీఎస్‌ఆర్‌ కార్యకలాపాలపై కొంత మొత్తాన్ని వెచ్చించడం తప్పనిసరి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని