close

తాజా వార్తలు

Published : 29/06/2020 11:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెట్రో ధరల పెంపుపై గళమెత్తండి: రాహుల్‌

దిల్లీ: పెట్రో ధరల్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటోందని కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. గత 21 రోజులుగా ధరల్ని పెంచుతూ ప్రజలకు తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. దేశ పౌరులంతా పెట్రో ధరల పెంపునకు వ్యతిరేకంగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ సంక్షోభం, చైనాతో ఘర్షణ ఇలా అన్ని విషయాల్లో ప్రభుత్వం ప్రజలని ఒంటరి చేస్తోందని ఆయన విమర్శించారు. పెంచిన ధరల్ని ఉపసంహరించుకునే వరకు తమ నిరసన గళం వినిపించాలని కోరారు. పెట్రో ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేటి నుంచి దేశవ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ట్విటర్‌ వేదికగా.. ‘స్పీక్‌ అప్‌ ఎగెనెస్ట్‌ ప్యుయల్‌ హైక్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా రాహుల్‌ మాట్లాడుతూ ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ప్రజలంతా పెట్రో ధరల పెంపుపై తమ అభిప్రాయాల్ని వ్యక్తపరచాలని కోరారు.

మరోవైపు నేడు దిల్లీలో పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ విషయంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ అందించనున్నారు. దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ కార్యకర్తలంతా జూన్‌ 30 నుంచి జులై 4 వరకు వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది. కొన్ని రోజుల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు లీటర్‌ పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెరిగిన విషయం తెలిసిందే.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.