close

తాజా వార్తలు

Published : 30/06/2020 00:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌-19: ప్ర‌తి 18సెక‌న్ల‌కు ఓ ప్రాణం!

6నెల‌ల్లోపే కోటి మందికి సోకిన వైర‌స్‌

ఇంట‌ర్నెట్ డెస్క్‌: గ‌త సంవ‌త్స‌రం డిసెంబ‌రులో చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి అన‌తికాలంలోనే ప్ర‌పంచాన్ని చుట్టుముట్టింది. డిసెంబ‌ర్ 31న చైనాలోని వుహాన్ న‌గ‌రంలో బ‌య‌ట‌ప‌డ్డ ఈ వైర‌స్, జూన్ 2020 చివ‌రినాటికి ప్ర‌పంచంలో ఒక‌ కోటి మందికి సోకింది. వుహాన్ న‌గ‌రంలో జ‌న‌వ‌రి 11వ తేదీన ఓ 61ఏళ్ల వ్య‌క్తి ఈ ప్రాణాంత‌క వైర‌స్‌ కార‌ణంగా ప్రాణాలు కోల్పోయాడు. దీన్నే ప్ర‌పంచంలో తొలి క‌రోనా మ‌ర‌ణంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. ఇలా స్వ‌ల్ప కాలంలోనే ప్ర‌పంచంలోని దాదాపు అన్ని దేశాల‌కు వ్యాపించిన కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి ఆరునెల‌ల్లోపే 5ల‌క్ష‌ల మందిని బ‌లితీసుకుంది. జూన్ 1వ‌ తేదీ నుంచి 27వ‌ర‌కు ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటే, ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌రాస‌రి రోజుకు 4700 మంది క‌రోనా బాధితులు మృత్యువాత‌ప‌డుతున్నారు. ఈ లెక్క‌న ప్ర‌తి గంట‌కు 196 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అన‌గా‌ ప్ర‌తి 18సెక‌న్ల‌కు ఒక క‌రోనా మ‌ర‌ణం న‌మోద‌వుతున్న‌ట్లు అంత‌ర్జాతీయ‌ నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. 

మ‌లేరియా, ఎయిడ్స్‌ను మించిన క‌రోనా..

అయితే ప్ర‌పంచాన్ని ప‌ట్టిపీడిస్తోన్న మ‌లేరియా, ఎయిడ్స్ వంటి రోగాల కన్నా ప్ర‌స్తుతం ఈ ఐదు నెల‌ల కాలంలో క‌రోనా సోకి చ‌నిపోయిన‌వారే ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం.  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌కారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తినెల‌ మ‌లేరియాతో 36వేల మంది, ఎయిడ్స్ సంబంధిత వ్యాధుల‌తో 64వేల మంది చ‌నిపోతున్నారు. కాగా, ఈ ప్రాణాంత‌క‌ కొవిడ్ మ‌హ‌మ్మారి సోకి ప్ర‌తినెల 78,000 మంది చ‌నిపోతుండ‌టం వైర‌స్ తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది.

గ‌డిచిన కొన్ని వారాల్లో ప‌లు దేశాల్లో వైర‌స్ తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ, అమెరికా, బ్రెజిల్‌, భార‌త్ వంటి దేశాల్లో కొవిడ్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. ముఖ్యంగా, క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో కుదేలైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను గాడిలో పెట్టే ప్ర‌య‌త్నంలో భాగంగా ప‌లుదేశాలు లాక్‌డౌన్‌ ఆంక్ష‌లను స‌డ‌లిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వైర‌స్ వ్యాప్తి విస్తృతంగా పెరుగుతుండ‌టం క‌ల‌వ‌ర‌పెడుతోంది. వైర‌స్ బ‌య‌ట‌ప‌డిన తొలిరోజుల్లో ఆసియా దేశాల నుంచి మిడిల్ ఈస్ట్, యూర‌ప్‌, ఉత్త‌ర అమెరికాలకు వ్యాపించిన క‌రోనా మ‌హ‌మ్మారి, తాజాగా లాటిన్ అమెరికా, భార‌త్ వంటి దేశాల్లో త‌న విశ్వ‌రూపం చూపిస్తోంది.

యూర‌ప్‌లో వృద్ధుల‌పై ప్ర‌కోపం..

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచంలోని అన్ని వ‌య‌సుల ప్ర‌జ‌ల‌పై ప్ర‌భావం చూపిస్తున్న‌ప్ప‌టికీ.. యూర‌ప్ వంటి దేశాల్లో వృద్ధులే దీనికి ఎక్కువ‌గా బ‌లి అవుతున్నారు. ఈయూ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ ప్ర‌కారం, ఏప్రిల్ నెల‌లో 20దేశాల్లో న‌మోదైన 3ల‌క్ష‌ల పాజిటివ్ కేసుల‌ను ప‌రిశీలించ‌గా.. వాటిలో దాదాపు 46శాతం మంది 80ఏళ్ల పైబ‌డిన‌వారే ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే, ఇండోనేషియా వంటి దేశాల్లో చిన్నారులు ఎక్కువ‌గా మ‌ర‌ణిస్తున్న‌ట్లు అనుమానిస్తున్నారు.

డిసెంబ‌ర్ 31, 2019 నుంచి జూన్ 29, 2020 వ‌ర‌కు క‌రోనా వికృతరూపం ఇలా..

డిసెంబ‌ర్ 31, 2019: చైనాలోని వుహాన్ న‌గ‌రంలో తొలిసారిగా క‌రోనా అనుమానిత కేసులు గుర్తింపు. 

జ‌నవ‌రి 11, 2020: క‌రోనా వైర‌స్‌తో తొలి మ‌ర‌ణం

జ‌న‌వ‌రి 13: థాయిలాండ్‌లో చైనా మహిళ క్వారంటైన్‌, చైనా బ‌య‌ట తొలి కేసు న‌మోదు

జ‌న‌వ‌రి 23:  చైనాలో క‌రోనాతో 18మంది మ‌ర‌ణించ‌డంతో వుహాన్‌, హుబే ప్రావిన్సుల్లో లాక్‌డౌన్ విధింపు

జ‌న‌వ‌రి 24:  యూర‌ప్ న‌గ‌ర‌మైన ఫ్రాన్స్‌లో తొలి పాజిటివ్ కేసు న‌మోదు

జ‌న‌వ‌రి 27: అమెరికాలో తొలిసారి క‌రోనా వైర‌స్‌ నిర్ధార‌ణ‌

జ‌న‌వ‌రి 30: ఆరోగ్య అత్య‌యిక స్థితిని ప్ర‌క‌టించిన‌ ప‌్ర‌పంచ ఆరోగ్య సంస్థ

ఫిబ్ర‌వ‌రి 2:  ఫిలిప్పైన్స్‌లో తొలి క‌రోనా మ‌ర‌ణం. చైనా బ‌య‌ట తొలి క‌రోనా మ‌ర‌ణం ఇక్క‌డే చోటుచేసుకుంది. 

ఫిబ్ర‌వ‌రి 26: చైనాలో భారీగా పెరిగిన కేసులు. ఇట‌లీ, ఇరాన్‌ల‌లో వేగంగా వైర‌స్ వ్యాప్తి ప్రారంభం

మార్చి 1: అమెరికాలో తొలి క‌రోనా మ‌ర‌ణం. వాషింగ్ట‌న్‌లో ఇద్ద‌రు మ‌ర‌ణించ‌డంతో సియాటెల్‌ స‌మీపంలోని ఓ న‌ర్సింగ్ హోం మూసివేత‌

మార్చి 4: హాంగ్‌కాంగ్‌లో ఓ పెంపుడు కుక్క‌కు వైర‌స్ సోకిన‌ట్లు అనుమానం. మాన‌వుల నుంచి జంతువుల‌కు వ్యాపిస్తున్న‌ట్లు అనుమానం.

మార్చి 6: ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్ష‌కు చేరిన క‌రోనా బాధితులు. 3400 మంది మృత్యువాత‌

మార్చి 13: అమెరికాలో నేష‌న‌ల్‌ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్

మార్చి 14: ఫ‌్రాన్స్‌, స్పెయిన్, ఇట‌లీల‌లో లాక్‌డౌన్ విధింపు

మార్చి 19: క‌రోనా మ‌ర‌ణాల్లో చైనాను దాటిన ఇట‌లీ

మార్చి 24: భార‌త్‌లో లాక్‌డౌన్‌

ఏప్రిల్ 2: ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ది ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

ఏప్రిల్ 10: ప‌్ర‌పంచంలో లక్షకు చేరిన క‌రోనా మ‌ర‌ణాలు, 16ల‌క్ష‌లు దాటిన పాజిటివ్ కేసులు

ఏప్రిల్ 25: ప‌్ర‌పంచంలో 2ల‌క్ష‌ల మ‌ర‌ణాలు, 30ల‌క్ష‌ల కేసులు

మే 15: 3ల‌క్ష‌ల మ‌ర‌ణాలు, 45ల‌క్ష‌ల కేసులు

జూన్‌ 7: 4ల‌క్ష‌ల మ‌ర‌ణాలు, 70 ల‌క్ష‌ల కేసులు

జూన్ 28 నాటికి: 5ల‌క్ష‌ల మ‌ర‌ణాలు, 1 కోటి పాజిటివ్ కేసులు

ఇదిలా ఉంటే, భార‌త్‌లో జూన్ 29 నాటికి 5,48,318 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కాగా వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు 16,475 మంది మృత్యువాత‌ప‌డ్డారు.

ఇవీ చ‌ద‌వండి..
కోటి దాటినా త‌ప్ప‌ని ముప్పు!
క‌ట్ట‌డికి దారులన్నీ మూసుకుపోతున్నాయ్‌!


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.