close

తాజా వార్తలు

Published : 30/06/2020 09:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు 

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.21 సమయంలో సెన్సెక్స్‌ 182 పాయింట్లు లాభపడి 35,143 వద్ద, నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 10,373 వద్ద కొనసాగుతున్నాయి. దేశంలో అన్‌లాక్‌2 మొదలవుతోందని ప్రభుత్వం ప్రకటించడంతో వ్యాపార కార్యకలాపాలు జోరందుకోనున్నాయి. దీంతో మార్కెట్లు కూడా సానుకూలంగా స్పందించాయి.  దీనికి సంబంధించి ప్రధాని మోదీ నేటి సాయంత్రం మాట్లడనుండటంతో మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. దీంతోపాటు నేడు ట్రాయ్‌ మొబైల్‌ సబ్‌స్క్రైబర్‌ డేటాను విడుదల చేయనుంది.  నిన్న అమెరికా మార్కెట్లు కూడా సానుకూలంగా మగియడంతో ఆ ప్రభావం దేశీయ సూచీలపై పడింది. డోజోన్స్‌ 2.3, ఎస్‌అండ్‌పీ 500 1.47, నాస్‌డాక్‌ 1.2శాతం లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు కూడా  లాభాల్లో ఉన్నాయి. 
నేడు మొత్తం 596 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. వీటిల్లో వోడాఫోన్‌ ఐడియా, ఓఎన్‌జీసీ, సెయిల్‌ వంటి కంపెనీలు ఉన్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని