ఊగిసలాటలో ముగిసిన మార్కెట్లు..
close

తాజా వార్తలు

Published : 30/06/2020 16:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊగిసలాటలో ముగిసిన మార్కెట్లు..

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు ఊగిసలాటధోరణిలో ట్రేడయ్యాయి. సెన్సెక్స్‌ 45 పాయింట్లు నష్టపోయి 34,915 వద్ద, నిఫ్టీ 61పాయింట్లు లాభపడి 10,374 వద్ద ముగించాయి.  ఉదయం నుంచి లాభాల్లో ఉన్న బీఎస్‌ఈ  మధ్యాహ్నానికి నష్టాల్లోకి జారుకొంది. ఇమామీ, జిందాల్‌ స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సన్‌టెక్‌ రియాలిటీ, శ్రెయి ఇన్ఫ్రా లాభపడగా.. ఓమాక్స్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, పరాగ్‌ మిల్క్‌, ఇంజినీర్స్‌ ఇండియా, సోలార్‌ ఇండస్ట్రీస్‌లు నష్టపోయాయి. 

అన్‌లాక్‌2పై ప్రధాని ప్రసంగం ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమై చివర్లో అమ్మకాలకు పాల్పడ్డారు. నేటి ట్రేడింగ్‌లో టాటా స్టీల్‌ 4శాతం వరకు లాభపడింది. నిఫ్టీలో లోహరంగ, ఆటో సూచీలు అన్నికంటే అత్యధికంగా లాభపడింది. సెన్సెక్స్‌లోని 30షేర్లలో 17 నష్టాల్లో ముగించాయి. 

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని