స్వల్ప లాభాలతో మొదలైన మార్కెట్లు
close

తాజా వార్తలు

Updated : 01/07/2020 10:10 IST

స్వల్ప లాభాలతో మొదలైన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం స్వల్పలాభాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.35 సమయంలో సెన్సెక్స్‌ 157 పాయింట్లు లాభపడి 35,073 వద్ద, నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 10,339 వద్ద కొనసాగుతున్నాయి.  ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని ప్రభుత్వం మంగళవారం వెల్లడించిన డేటా తెలియజేస్తోంది.  తొలి రెండునెలల ఆదాయంలో రూ.4.66లక్షల కోట్లు ఆదాయం తగ్గినట్లు పేర్కొంది. దీంతో ఇన్వెస్టర్లు దూకుడుగా వ్యవహరించడంలేదు. ముఖ్యంగా 8 కీలక రంగాల్లో వృద్ధిరేటు మే నాటికి  23.4 శాతానికి కుంగింది. దీంతో పాటు జూన్‌లో ఉత్పత్తి రంగానికి చెందిన పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ గణంకాలను నేడు విడుదల చేయనున్నారు. ఆటోమొబైల్‌ రంగంలో డిమాండ్‌ పెరగడంతో  జూన్‌లో విక్రయాలు పెరిగి ఆశాజనకంగా ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. 

నేడు మొత్తం ఆరు సంస్థలు ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిల్లో ఎవ్రీడే వంటి సంస్థలు ఉన్నాయి. డోజోన్స్‌ 0.85 శాతం, ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్‌లు లాభపడ్డాయి. ఆసియాలో జపాన్‌, ద.కొరియా సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని