భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు 
close

తాజా వార్తలు

Published : 01/07/2020 16:06 IST

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు 

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌ను భారీ లాభాల్లో ముగించాయి. సెన్సెక్స్‌ 498 పాయింట్లు లాభపడి 35,414 వద్ద నిఫ్టీ 127 పాయింట్లు లాభపడి 10,430 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. జీఐసీ హౌసింగ్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, కేఆర్‌బీఎల్‌, ఇండియన్‌ బ్యాంక్‌, స్వాన్‌ ఎనర్జీ లాభపడగా.. ఓమెక్సా, టినాడు న్యూస్‌ప్రింట్‌, క్యూస్‌ కార్ప్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, శ్రెయి ఇన్ఫ్రా నష్టపోయాయి. 
యాక్సెస్‌ బ్యాంక్‌, బజాజ్‌ఫిన్‌ సర్వీస్‌, హెచ్‌డీఎఫ్‌సీలు 4శాతం వరకు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ షేర్లు 4శాతం పతనమయ్యాయి. తొలిసారి నష్టాలను ప్రకటించడంతో వాటాదారులు తీవ్ర నిరుత్సాహానికి గురైయ్యారు. బ్యాంక్‌ నిఫ్టీ సూచీ భారీగా లాభపడింది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని