ఉత్సాహంగా మొదలైన మార్కెట్లు
close

తాజా వార్తలు

Published : 02/07/2020 09:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉత్సాహంగా మొదలైన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.32 సమయంలో సెన్సెక్స్‌ 235 పాయింట్లు లాభపడి 35,646 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి 10,504 వద్ద ట్రేడవుతున్నాయి. ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, రైటెస్‌ లిమిటెడ్‌, దిలిప్‌ బిల్డ్‌కాన్‌ వంటి షేర్లు లాభాల్లో ఉండగా..  ఓమెక్స్‌, మాగ్మా ఫిన్‌కార్ప్‌, శ్రెయి ఇన్‌ఫ్రా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక రంగాల వారీగా చూస్తే ఫైనాన్స్‌, బ్యాంక్‌, ఎనర్జీల షేర్లు అత్యధిక లాభాల్లో ఉన్నాయి. ఐటీ, ఆటో, ఇన్ఫ్రా రంగాల సూచీలు నష్టపోతున్నాయి. 

నిన్న ప్రభుత్వ జీఎస్టీ ఆదాయం మెరుగుపడటం ఆర్థిక వ్యవస్థగాడిన పడుతోందనడానికి సంకేతంగా మార్కెట్‌ భావించింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభాల్లో ఉన్నాయి. వాల్‌స్ట్రీట్‌ సూచీలైన ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్‌ లాభపడగా.. డోజోన్స్‌ స్వల్పంగా నష్టపోయింది. ఆసియాలోని హాంగ్‌కాంగ్‌, ఆస్ట్రేలియా, జపాన్‌కు చెందిన నిక్కీ సూచీలు కూడా లాభాల్లో ఉన్నాయి. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని