లాభాల్లో ముగిసిన మార్కెట్లు
close

తాజా వార్తలు

Published : 02/07/2020 16:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి.  సెన్సెక్స్‌ 429 పాయింట్లు లాభపడి 35,843 వద్ద, నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 10,551 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ఫిలిప్స్‌ కార్బన్‌, ఐఎప్‌సీఐ లిమిటెడ్‌, జీఐసీ హౌసింగ్‌, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, స్టెర్లైట్‌ టెక్నాలజీస్‌ లాభపడగా... ఓమెక్సె లిమిటెడ్‌, మాగ్మాఫిన్‌ కార్ప్‌, ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌, శ్రెయి ఇన్‌ఫ్రా, జస్ట్‌ డయల్‌ నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే ఒక్క బ్యాంకింగ్‌ రంగ సూచీ తప్ప మిగిలినవన్నీ లాభాల్లోనే ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ మార్చి 11 తర్వాత తొలిసారి 36,000 మార్కును దాటింది. ఆ తర్వాత 35,843 వద్ద స్థిరపడింది. జీఎస్‌టీ ఆదాయం పెరగడం ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపింది. ఇక మహీంద్రా అండ్‌ మహీంద్రా 5శాతం.. ఇన్ఫోసిస్‌, ఓఎన్‌జీసీ 3శాతం చొప్పన లాభపడ్డాయి. 

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని