కొనసాగుతున్న లాభాల పరంపర
close

తాజా వార్తలు

Published : 03/07/2020 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొనసాగుతున్న లాభాల పరంపర

ముంబయి: గత రెండు రోజుల వరుస లాభాల పరంపరను దేశీయ మార్కెట్లు శుక్రవారం కూడా కొనసాగిస్తున్నాయి. ఉదయం 9.41 గంటల సమయంలో సెన్సెక్స్‌ 83 పాయింట్లు లాభపడి 35,927 వద్ద కొనసాగుతుండగా.. సెన్సెక్స్‌ 23 పాయింట్లు ఎగబాకి 10,575 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.68 వద్ద కొనసాగుతోంది. అమెరికాలో నిరుద్యోగిత తగ్గడం, వ్యాక్సిన్‌ తయారీపై ఆశాజనక వార్తల నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌ మార్కెట్లు సానుకూలంగా కదిలాయి. దీంతో ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే దేశీయ సూచీలు లాభాల్లో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. 

టాటా మోటార్స్‌ లిమిటెడ్‌, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఆటో, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, టాటా స్టీల్‌, వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టా్ల్లో కొనసాగుతున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని