ఇన్‌స్టాగ్రామ్‌లో టిక్‌టాక్‌ వంటి ఫీచర్లు ..!
close

తాజా వార్తలు

Published : 04/07/2020 16:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇన్‌స్టాగ్రామ్‌లో టిక్‌టాక్‌ వంటి ఫీచర్లు ..!

ఇంటర్నెట్‌డెస్క్‌: టిక్‌టాక్‌పై నిషేధం విధించడంతో.. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఇన్‌స్టాగ్రామ్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే రీల్స్‌ పేరుతో గతేడాది నవంబర్‌లో ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిలో టిక్‌టాక్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిపై గతవారం ఇన్‌స్టా స్పందిస్తూ ఇప్పటికే దీనిని ఫ్రాన్స్‌, జర్మనీల్లో పరీక్షించామని పేర్కొంది. దీనిని భారత్‌లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 

భారత్‌లో ఇప్పటికే ఎంపిక చేసిన యూజర్లకు దీనిని అందించిందని ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. అందుకే ఈ టెక్నాలజీ అందుకోవాల్సిన దేశాల జాబితాలో భారత్‌ లేదని తెలిపింది.  రీల్స్‌లో కూడా 15క్షణాల పాటు వీడియోను చేసే అవకాశం ఉంది. దీనికి అవసరమైన ఆడియోను ఎడిట్‌ చేసుకోవచ్చు. 

‘రీల్స్ అప్‌డేట్‌ వెర్షన్‌ను మరిన్ని దేశాల్లో పరీక్షించాలని నిర్ణయించాము. ఈ ఫీచర్‌ సరదాగా, సృజనాత్మకంగా ప్రజలు తమను తాము ఆవిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ కొత్త వెర్షన్‌ మాకు విశ్వవ్యాప్తంగా మరింత మంది వినియోగదారులను తీసుకొస్తుందని భావిస్తున్నాం. దీనిని విడుదల చేసే తేదీ, దేశాల పేర్లు ఇప్పట్లో వెల్లడించము’’ అని ఫేస్‌బుక్‌ ప్రతినిధి వెల్లడించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని