కరోనాతో చచ్చినా.. చావే!
close

తాజా వార్తలు

Published : 05/07/2020 07:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో చచ్చినా.. చావే!

మృతదేహాలు పూర్తిగా  కాలకుండానే వదిలేస్తున్నారు
ఈఎస్‌ఐ శ్మశానవాటికలో కుక్కలు పీక్కు తింటున్న దుస్థితి 

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే : మానవ జీవితాలను కరోనా అతలాకుతలం చేస్తోంది. దురదృష్టవశాత్తు ఈ మహమ్మారి సోకి ప్రాణం పోతే.. మృతదేహాన్ని కనీసం చూసేందుకు, అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులకు అవకాశం లేని దుస్థితి. ఇది చాలదన్నట్లు కరోనాతో చనిపోతే మృతదేహాలు పూర్తిగా కాలకుండానే వదిలేస్తుండటంతో శరీర భాగాలను కుక్కలు పీక్కు తింటున్న అమానవీయ ఘటన హైదరాబాద్‌ ఈఎస్‌ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో చోటు చేసుకుంది.

గాంధీ ఆసుపత్రిలో ఎవరైనా కరోనాతో చనిపోతే ఈఎస్‌ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో దహనం చేస్తున్నారు. మృతుల వివరాల నమోదు, అంత్యక్రియల పర్యవేక్షణకు జీహెచ్‌ఎంసీ ముగ్గురు సిబ్బందిని అక్కడ నియమించింది. అయితే మృతదేహాలు పూర్తిగా కాలకుండా వదిలేస్తుండటం కలకలం సృష్టిస్తోంది. శనివారం తన తాత అస్థికల కోసం శ్మశానవాటికకు వచ్చిన ఓ వ్యక్తి అక్కడ సగం కాలిన మృతదేహాలను కుక్కలు పీక్కుతింటుండటంతో అవాక్కయ్యారు. ఆ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వైరల్‌ అయ్యాయి. ఈ విషయమై శ్మశానవాటిక ఇన్‌ఛార్జి గోపాలకృష్ణ మాట్లాడుతూ కరోనా మృతుల దహన కార్యక్రమాలను జీహెచ్‌ఎంసీ సిబ్బందే పర్యవేక్షిస్తుంటారని సమాధానమిచ్చారు. మృతదేహాలు పూర్తిగా కాలే వరకు చూడాల్సిన బాధ్యత శ్మశానవాటిక నిర్వాహకులదేనని ఏఎంహెచ్‌ఓ డాక్టర్‌ భార్గవ నారాయణ వివరణ ఇవ్వడం గమనార్హం.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని