సినీ నటిపై అత్యాచారం
close

తాజా వార్తలు

Updated : 05/07/2020 10:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సినీ నటిపై అత్యాచారం

బెంగళూరు (యశ్వంతపుర) : బహుభాషా నటి అత్యాచారానికి- ఆపై వంచనకు గురైంది. తనకు ఎదురైన చేదు అనుభవంపై ఆమె నేరుగా ఫిర్యాదు చేయడంతో బెంగళూరు పోలీసులు కేసు దాఖలు చేశారు. ఆమె (30)పై ఓ ప్రైవేట్‌ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) అత్యాచారానికి పాల్పడి పరారైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాల్లోకి వెళితే.. బాధిత మహిళ స్థానిక జేజేనగర పరిధిలోని ఓ బహుళ అంతస్తుల భవంతిలో ఉంటున్నారు. ఇప్పటికే పలు కన్నడ, తమిళ సినిమాల్లో నటించారు. 2018లో బసవనగుడి పరిధి గాంధీ బజార్‌లో నిందితుడు మోహిత్‌ తనకు పరిచయమైనట్లు ఆమె తెలిపారు. తాను ఓ ప్రముఖ కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నట్లు పరిచయం చేసుకుని సన్నిహితంగా మెలిగాడు. కొద్ది రోజులకు ఆమెను తన సంస్థ ప్రచార రాయాబారిగా నియమించాడు. అందులో భాగంగా గోవా తదితర ప్రాంతాల్లో వారు పర్యటించారు. అనంతరం సంస్థ ఆర్థిక సమస్యల్లో ఉందంటూ తన నుంచి డబ్బు తీసుకున్నట్లు ఆమె ఆరోపించారు. 2019 జూన్‌ 22న పుట్టిన రోజు ఉందని మోహిత్‌ ఇంట్లో పార్టీ చేసుకున్నట్లు ఆమె తెలిపారు. ఆ మరుసటి రోజు తన పుట్టిన రోజు కావడంతో ఇద్దరూ పార్టీ చేసుకున్నామని, ఆ సమయంలో శీతల పానీయంలో మత్తు మందు కలిసి ఇచ్చాడని ఆరోపించారు. మత్తులోకి జారుకున్నాక దారుణానికి ఒడిగట్టాడని, ఆ సమయంలో చరవాణిలో చిత్రాలు తీసి తనను మోసం చేశాడని ఆమె ఆరోపించారు.

తరచుగా చిత్రాలు చూపి తన వద్ద డబ్బు లాగాడని, అలా.. రూ.20 లక్షలు గుంజాడని ఫిర్యాదులో నటి వివరించారు. బెదిరింపులు ఎక్కువ కావడంతో అతడి తల్లిదండ్రులకు కష్టాన్ని చెప్పుకొంటే వారూ బెదిరించినట్లు ఆరోపించారు. ఆమెను వంచించిన కేసులో నాయండనహళ్లి నివాసి మోహిత్‌ కోసం ప్రస్తుతం వేట సాగుతుండగా.. మద్దతుగా నిలిచిన అతడి తండ్రి మహదేవ్‌, తల్లి నాగవేణి, ఆ కుటుంబ సభ్యుడు రాహుల్‌ వ్యవహారాలపైనా దర్యాప్తు చేపట్టారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని