మార్కెట్లకు ‘రికవరీ’ జోష్‌
close

తాజా వార్తలు

Updated : 06/07/2020 18:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్లకు ‘రికవరీ’ జోష్‌

ముంబయి: దేశీయ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 465 పాయింట్లు లాభపడి 36,487 వద్ద, నిఫ్టీ 156 పాయింట్లు లాభపడి 10,763 వద్ద నేటి ట్రేడింగ్‌ను ముగించాయి. ఐటీఐ, త్రివేణీ టర్బైన్‌, గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌, బీహెచ్‌ఈఎల్‌, హింద్‌ కాపర్‌ లాభపడగా..  హిమత్‌ సిగ్కా సెడీ, ఓమెక్స్‌, ఫ్యూచర్‌ రీటైల్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌ వంటివి నష్టపోయాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నేడు రూ.11.5 లక్షల కోట్ల మార్కును దాటి రికార్డు సృష్టించింది. 

అంతర్జాతీయ పరిణామాలు..

అంతర్జాతీయ మార్కెట్లు, పరిణామాలు సానుకూలంగా ఉండటంతో దేశీయంగా సూచీలు లాభపడ్డాయి. చైనా కాంపోజిట్‌ 850 రోజుల సగటును నేడు దాటి 5.8 శాతం లాభపడింది. ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గడం కూడా కారణమైంది.  మరోపక్క జపాన్‌, హాంగ్‌కాంగ్‌, దక్షిణ కొరియా సూచీలు కూడా భారీగా లాభపడ్డాయి. 

టీకాపై ఆశలు..

భారత్‌లో టీకా తయారీపై ఆశలు పెరగడం కూడా సూచీలను ముందుకు తీసుకెళ్లింది. భారత్‌ బయోటెక్‌, జైడస్‌ క్యాడిల్లా తయారు చేస్తున్న టీకాలు కీలక దశకు చేరుకున్నాయి. మరోపక్క గిలీద్‌ సైన్సెస్‌, ఫ్యూజీ ఫిల్మ్‌కు చెందిన ఔషధాల రాకతో చికిత్స కూడా వేగవంతమైంది. 

కొవిడ్‌ రికవరీలు పెరగడం కూడా..

కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో మార్కెట్‌కు సానుకూల సంకేతాలు పంపింది. దీనికి తోడు ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, ఆటోమొబైల్‌ విక్రయాలు మెల్లగా పెరగడం ఆశలు రేపుతున్నాయి. ఉత్పత్తి రంగంలోని పర్చేజింగ్‌ మేనేజర్ల సూచీ 37.5 శాతం నుంచి 47.2 శాతానికి పెరగడంతో ఉత్సాహాన్ని నింపింది. 

కీలక రంగాలు లాభపడటం..

సూచీల్లోని కీలక రంగాలు లాభపడటం మార్కెట్‌ ర్యాలీకి కారణమైంది. నిఫ్టీలో బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, లోహరంగాలు 2-3 శాతం లాభాల్లో ఉన్నాయి. ఐటీ, విద్యుత్తు రంగాలు 1.5 శాతం, ఎఫ్‌ఎంసీజీ సూచీ 0.5 శాతం లాభాల్లో పయనించాయి. 

నిఫ్టీ కీలక స్థాయి దాటడం..

నిఫ్టీ కీలకమైన 10,700-10,750 మార్కును దాటడం మార్కెట్లో ఇన్వెస్టర్ల ఉత్సాహాన్ని తెలియజేస్తోంది.  ఈ స్థాయిని దాటడంతో భవిష్యత్తులో మరింత ముందుకు పోతుందని అంచనావేస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని