close

తాజా వార్తలు

Published : 07/07/2020 16:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఇవాళ తెలంగాణ చరిత్రలో బ్లాక్‌డే : ఉత్తమ్‌

ఇవాళ  తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బాధాకరమైన రోజని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూఢ నమ్మకాల కోసం 4 కోట్ల ప్రజలను పణంగా పెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం తప్పులు చేస్తే న్యాయవ్యవస్థ కలుగజేసుకునేది.. కానీ ఇవాళ న్యాయవ్యవస్థ పై కూడా ప్రజల అసంతృప్తితో ఉన్నారన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగే లోపే కూల్చివేత పనులు పూర్తి చేయాలనే ఆలోచనతోనే సచివాలయాన్ని కూల్చుతున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ‘‘పేదల ఇళ్లలోనూ వైకాపా నేతల కక్కుర్తి’’

వైకాపా ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజల కోసం కాదు అని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇళ్ల స్థలాల సేకరణలో అవినీతిపై తెదేపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నేతలతో చంద్రబాబు ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. ‘‘పేదల ఇళ్లలోనూ వైకాపా నేతలు కక్కుర్తి పడుతున్నారు. ప్రజాధనాన్ని ఎక్కడికక్కడ దుర్వినియోగం చేస్తున్నారు. తెదేపా హయాంలో 10 లక్షల ఇళ్లు కట్టాం. మేం కట్టిన ఇళ్లను కరోనా సెంటర్లుగా మార్చారు’’ అని ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. మూడో ద‌శ‌కు చైనా వ్యాక్సిన్‌!

క‌రోనావైర‌స్‌ను ఎదుర్కోవ‌డం కోసం చైనా సినోవాక్ బ‌యోటెక్ త‌యారుచేస్తోన్న వ్యాక్సిన్ మూడో ద‌శకు చేరుకున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ మూడో ద‌శ ట్ర‌య‌ల్స్‌ బ్రెజిల్‌లో ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపింది. కొవిడ్‌-19 వ్యాక్సిన్ కోసం చైనా కంపెనీ సినోవాక్ బ్రెజిల్‌కి చెందిన‌ వ్యాక్సిన్ త‌యారీదారు 'ఇన్‌స్టిట్యూటో బూటాన్‌ట‌న్'‌తో క‌లిసి ప‌నిచేయ‌నుంది. దీనిలోభాగంగా జులైలో మూడోద‌శ ట్ర‌య‌ల్స్‌ ప్రారంభించ‌డానికి దాదాపు 9వేల మంది ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌ల‌ను నియ‌మించుకోనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఏపీలో కరోనా: కొత్తగా 1,178 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,178 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో రాష్ట్రానికి సంబంధించి 1,155 మంది, ఇతర ప్రాంతాల నుంచి వారు 23 మందికి సోకినట్లు పేర్కొంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 21,197కి చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 11,200 మంది చికిత్స పొందుతుండగా.. 9,745 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. వావ్‌:ధోనీ బర్త్‌డే పాట చూస్తారా!

విండీస్‌ ఆటగాడైన బ్రావో మంచి సింగర్‌. తనే స్వయంగా పాటలు రాసి ఆల్బమ్స్‌ రూపొందిస్తాడు. మహీ పుట్టిన రోజు సందర్భంగా అతడు ‘హెలికాప్టర్‌’ పేరుతో ఒక పాటను విడుదల  చేశాడు. మహీ తనకు సోదరుడని పేర్కొన్నాడు. నంబర్‌ 7 జెర్సీ ధరించే ధోనీ అంటే అందరికీ ఇష్టమన్నాడు. అంతేకాదు.. అతడిని మూడో స్థానంలో పంపి ప్రపంచానికి గొప్ప క్రికెటర్‌ను పరిచయం చేసిన గంగూలీకి ధన్యవాదాలు తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ‘‘ఆ ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారు’’

కరోనా చికిత్సలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఛార్జీల వసూలుపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది శ్రీకిషన్‌ శర్మ పిల్‌ వేశారు. కరోనా చికిత్సలు, ఛార్జీల్లో పారదర్శకతపై ప్రైవేటు ఆస్పత్రులకు మర్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్‌ కోరారు. కరోనా చికిత్సలకు ఎంత చార్జీ తీసుకోవాలో ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ పట్టించుకోకపోవడం శోచనీయమని హైకోర్టు అభిప్రాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ...ఫలితాల వెల్లడిలో జాప్యం నిజమే: ఆళ్ల నాని

‘‘ప్రైవేటు ల్యాబుల్లో ఒకట్రెండు ఫలితాలు తప్పుగా వచ్చినట్లు తెలిసింది. మరోసారి తప్పుడు రిపోర్టు వస్తే లైసెన్స్‌ రద్దు చేయడానికి వెనుకాడం’’ అని ఆంధ్రప్రదేశ్‌ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కరోనా బాధితులతో మంత్రి మాట్లాడారు. వారికి అందుతున్న ఆహారం, వైద్య చికిత్సపై ఆరా తీశారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలపై కొవిడ్‌ బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి చెప్పారు. టెస్టుల సంఖ్య పెంచడం వల్ల ఫలితాల వెల్లడిలో జాప్యం నిజమే అని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. రెడ్‌మీ నోట్‌9 ప్రో పోలికలతో పోకో ఎం2 ప్రో

స్వతంత్ర బ్రాండ్‌గా అవతరించిన పోకో.. భారత మార్కెట్‌లోకి తన మూడో ఫోన్‌ను విడుదల చేసింది. పోకో ఎం2 ప్రో పేరిట మంగళవారం లాంచ్‌ చేసింది. ఇంతకుముందు పోకో ఎఫ్‌1, పోకో ఎక్స్‌2 పేరిట ఫోన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ ఫోన్‌ ఫీచర్స్‌ ఏంటి? ధరెంత లాంటి వివరాలపై లుక్కేద్దాం! మార్చిలో షావోమి విడుదల చేసిన రెడ్‌మీ నోట్‌ 9 ప్రోను.. పోకో ఎం2 ప్రో పోలి ఉంటుంది.  పంచ్‌ హోల్‌ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్‌ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. గల్వాన్‌లో స్విచ్చేస్తే కాలాపానీలో వెలిగిందా..?

భారత హిమాలయ పర్వతసానువుల్లో ఉద్రిక్తతలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి.  లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయవద్ద  నుంచి భారత్‌, చైనా బలగాలు వెనక్కిమళ్లడంతో పరిస్థితి కొంత తేలికపడింది. మరోపక్క భారత్‌-నేపాల్‌ మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదంలో మరోసానుకూల పరిణామం చోటు చేసుకొంది. తాజాగా గల్వాన్ పై ప్రకటన వెలువడిన సమయంలో ఈ వార్త బయటకు రావడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఏడాది చివరి వరకూ కరోనా మనతోనే: గంగూలీ

ఈ ఏడాది చివరి వరకు లేదా వచ్చే సంవత్సరం ఆరంభం వరకూ భారత్‌.. కరోనా వైరస్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితి నెలకొందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. తాజాగా మయాంక్‌ అగర్వాల్‌తో ఓపెన్‌ చాట్‌లో పాల్గొన్న దాదా కొవిడ్‌ 19పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి ఐపీఎల్‌ను మన దేశంలో నిర్వహించే పరిస్థితులు లేవన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.