close

తాజా వార్తలు

Published : 08/07/2020 16:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐదు రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 345 పాయింట్లు నష్టపోయి 36,329 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు నష్టపోయి 10,705 వద్ద ముగిశాయి. ఎంఎంటీసీ, హింద్‌ కాపర్‌, సెంచురీ ప్లైబోర్డ్స్‌, స్టీల్‌ అథారిటీ, బిర్లా సాఫ్ట్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. ప్రజిమ్‌ జాన్సన్‌, త్రివేణీ టర్బైన్‌, ప్రస్టీజ్‌ ఎస్టేట్‌, డిష్మన్‌ కార్బోజన్‌, శంకర బిల్డింగ్స్‌ షేర్లు నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలు లాభాల్లో ఉండగా.. దాదాపు మిగిలిన రంగాలన్నీ నష్టాల్లో ఉన్నాయి.

ఉదయం వరకు ట్రేడింగ్‌ లాభనష్టాల్లో ఊగిసలాట ధోరణి కొనసాగింది. ట్రేడింగ్‌ ముగియడానికి చివరి గంటలో మాత్రం భారీగా సూచీలు పతనం అయ్యాయి. బ్లూచిప్‌ షేర్లలో మహీంద్రా, బజాజ్‌ ఆటోలు మాత్రమే బాగా రాణించాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని