భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
close

తాజా వార్తలు

Published : 09/07/2020 16:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ లాభాల్లో ముగిసిన సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 408 పాయింట్లు లాభపడి 36,737 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు లాభపడి 10,813 వద్ద ముగిశాయి. డీబీకార్ప్‌, డిష్మన్‌ కార్బొజన్‌, కేఈఐ ఇండస్ట్రీస్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా, అరవింద్‌ షేర్లు భారీగా లాభపడగా.. ఎంఎంటీసీ, ఫ్యూచర్‌ రిటైల్‌, ఓమెక్స్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, జైన్‌ ఇరిగేషన్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. గురువారం మధ్యాహ్నం గ్లోబల్‌ వీక్‌ సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం తర్వాత మార్కెట్లు జోరుగా కదిలాయి. ఆయన భారత్‌ వేగంగా కోలుకుంటోందనే దానికి సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పడం మార్కెట్లకు ధైర్యాన్ని ఇచ్చింది. బజాజ్‌ ఫైనాన్స్‌, టాటాస్టీల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ బాగా లాభపడ్డాయి. టీసీఎస్‌ షేర్లు సానుకూలంగా ట్రేడ్‌ అయ్యాయి. నిఫ్టీలోని అన్ని రంగాల సూచీలు నేడు పెరిగాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని