close

తాజా వార్తలు

Published : 10/07/2020 10:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: గురువారం భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు నేలచూపులు చూస్తున్నాయి. శుక్రవారం ఉదయం 9:44 గంటల సమయంలో సెన్సెక్స్‌ 51 పాయింట్లు దిగజారి 36,686 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 13 పాయింట్లు ఎగబాకి 10,800వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.76 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాల నేపథ్యంలో కంపెనీల షేర్లు నష్టాల్లో పయనిస్తుండడం సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 

సన్‌ఫార్మా, హీరో మోటోకార్ప్‌,డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌, ఎస్‌బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌, సిప్లా, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. టెక్‌ మహీంద్రా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, టైటన్‌ కంపెనీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని