నష్టాలతో ముగిసిన మార్కెట్లు
close

తాజా వార్తలు

Published : 10/07/2020 16:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నష్టాలతో ముగిసిన మార్కెట్లు

ముంబయి: పబ్లిక్‌, ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లలో తలెత్తిన అమ్మకాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లను శుక్రవారం దెబ్బతీశాయి. దీంతో సెన్సెక్స్‌ 143 పాయింట్లు క్షీణించి 36,594 వద్ద ముగిసింది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 10,768 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లు డీలాపడటంతో తొలి నుంచీ మదుపర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు. ఫలితంగా సెన్సెక్స్‌ 36,401 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఓ దశలో 36,749 వద్ద గరిష్ఠాన్ని తాకి తిరిగి వెనక్కి తగ్గింది . ఇదే బాటలో 10,764 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 10,819 వద్ద గరిష్ఠాన్ని తాకగా.. 10,713 వద్ద కనిష్ఠాన్ని చవిచూసింది. కొవిడ్‌-19పై నెలకొన్ని భయాలే మార్కెట్లపై ఇంకా ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సన్‌ ఫార్మా, హెచ్‌యూఎల్‌, బ్రిటానియా లిమిటెడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌ కంపెనీ, గెయిల్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని