రిలయన్స్ చేతికి రూ.30వేల కోట్లు
close

తాజా వార్తలు

Published : 12/07/2020 13:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రిలయన్స్ చేతికి రూ.30వేల కోట్లు

ముంబయి: రిలయన్స్‌ జియోలో దాదాపు 25.09శాతం వాటాలను విక్రయిస్తూ రిలయన్స్‌ చేసుకొన్న డీల్స్‌ వేగంగా అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే వీటిల్లో నాలుగు డీల్స్‌ నుంచి రూ.30,062 కోట్లు అందినట్లు ఆ సంస్థ నిన్న సెబీకి అందజేసిన రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 

దాదాపు 6.13శాతం విలువైన వాటాలకు సంబంధించి ఎల్‌ కాటర్టన్‌, ది పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్, సిల్వర్‌ లేక్‌, జనరల్‌ అట్లాంటిక్‌ వంటి సంస్థలతో కుదుర్చుకొన్న ఒప్పందాలు పూర్తయినట్లు ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది. అంతకు ముందు కూడా ఫేస్‌బుక్‌తో డీల్‌ పూర్తికావడంతో రూ.43,574 కోట్లను రిలయన్స్‌ అందుకొంది.  అప్పట్లో ఫేస్‌బుక్‌ చెందిన జాద్దూ హోల్డింగ్స్‌కు 9.99 శాతం వాటాను కేటాయించినట్లు జులై7నాటి రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. రిలయన్స్‌ జియోలో మొత్తం 25.09 వాటాను 11 మంది ఇన్వెస్టర్లకు విక్రయించింది. ఈ డీల్స్‌ విలువ రూ.1,17,588.45 కోట్లు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని