రూ.12 లక్షల కోట్లకు రిలయన్స్‌..!
close

తాజా వార్తలు

Published : 13/07/2020 22:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.12 లక్షల కోట్లకు రిలయన్స్‌..!

ముంబయి: దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ నేడు రూ.12.09 లక్షల కోట్లను దాటింది.  సోమవారం ఉదయం 11.38 సమయానికి ఈ షేరు విలువ  రూ.52.15 పెరిగి రూ.1930.35 ట్రేడవుతోంది. ఒక భారతీయ కంపెనీ ఇంత మొత్తం మార్కెట్‌ విలువను పొందడం ఓ రికార్డు.  

మార్చి నుంచి 120 శాతం పెరిగి..
భారత్‌లో కొవిడ్‌  ప్రభావం మొదలైన మొదట్లో ఈ షేర్లు బాగా విలువ కోల్పోయాయి. ఒక దశలో రూ.1000 లోపునకు వచ్చాయి. కానీ, ఆ తర్వాత నుంచి మెల్లగా పుంజుకొన్నాయి. ఫేస్‌బుక్‌తో డీల్‌ తర్వాత వేగంగా విలువను పెంచుకొన్నాయి. మార్చి నాటి నుంచి ఇప్పటి వరకు 120శాతం పెరిగాయి. దీనికి తోడు మార్చి 2021 నాటికి రుణరహిత సంస్థగా అవతరిస్తామని ప్రకటించడం కూడా ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెంచింది. మరోపక్క ఆదివారం టెక్‌దిగ్గజం క్వాల్‌కామ్‌ కూడా రిలయన్స్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. జియో ప్లాట్‌ఫామ్‌లో 0.15శాతం వాటా కోసం రూ.730 వెచ్చిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో జియో డిజిటల్‌ సర్వీస్‌లో పెట్టుబడులు పెట్టిన 12వ సంస్థగా ఇది మారింది.  ఈ డీల్‌ పూర్తయితే రిలయన్స్‌ జియోలో 25.24శాతం వాటాలను విక్రయించినట్లు అవుతుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని