లాభాల్లో ముగిసిన మార్కెట్లు
close

తాజా వార్తలు

Published : 13/07/2020 16:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 99 పాయింట్లు లాభపడి 36,693 వద్ద నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 10,802 వద్ద స్థిరపడ్డాయి. రెయిన్‌ ఇండస్ట్రీస్‌, థైరోకేర్‌, బీఏఎస్‌ఎఫ్‌, బజాజ్‌ కన్జ్యూమర్‌, హథ్‌వేకేబుల్‌ లాభాల్లో.. యస్‌బ్యాంక్‌, శంకర బిల్డింగ్స్‌, జైన్‌ ఇరిగేషన్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, ఐడీబీఐ బ్యాంక్‌ వంటివి భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా రిలయన్స్‌ షేర్లను భారీగా కొనుగోలు చేయడం, ఐటీ, లోహరంగాల షేర్లు లాభాల్లో ఉండటం సూచీలకు కలిసొచ్చింది. నేటి ట్రేడింగ్‌లో రిలయన్స్‌ సుమారు 3శాతం విలువ పెరిగింది. ఇక టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ వంటి షేర్లు లాభపడటంతో సూచీలు ముందుకెళ్లాయి. ఆసియ మార్కెట్లలో జపాన్‌ సూచీలు, చైనా, ద.కొరియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని